Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ మీట్ పై ఎన్నికల కోడ్ నీలినీడలు

తెలంగాణ కేబినెట్ మీట్ ఈరోజు సాయంత్రం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ఉండడంతో మీటింగ్ పర్మిషన్ కోసం ఈసీని కోరింది ప్రభుత్వం. కానీ, ఇప్పటివరకూ అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మీటింగ్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెలకొంది 

New Update
TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఆ ఆంశాలపై చర్చించవద్దని కండిషన్స్!

Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ సమావేశం ఈరోజు నిర్వహించాల్సి ఉంది. ఈమేరకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే, ఈరోజు ఈ సమావేశం ఉంటుందా? లేదా? అనే సందిగ్దత నెలకొంది. ఎందుకంటే, ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ నిర్వహించడానికి అనుమతి ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకూ ఈసీ నుంచి పర్మిషన్ రాలేదు. అధికారులు ఇప్పుడు అనుమతి రావడం కష్టమనే అంటున్నారు. ఇప్పటికే కేబినెట్ భేటీ కోసం ఈసీ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అయినా.. ఇప్పటి వరకూ అనుమతి రాలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడంతో ఏ అధికారిక నిర్ణయం తీసుకోవాలన్నా.. ఈసీ పర్మిషన్ తప్పనిసరి. ఇప్పుడు ఈసీ కనుక అనుమతి ఇవ్వకపోతే, అనధికారికంగా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అప్పటిలోగా ఈసీ అనుమతి ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తమ్మీద ఎన్నికల కోడ్ నేపధ్యంలో క్యాబినెట్ భేటీ జరిగే అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

క్యాబినెట్ మీట్ లో ఈ అంశాలే ఎజెండా..
తెలంగాణ కేబినేట్ సమావేశం(Telangana Cabinet Meet) ఈరోజు (మే18)  జరగాల్సి ఉంది. ఈసీ పర్మిషన్ ఇస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారధ్యంలో రాష్ట్ర మంత్రివర్గం ఈ సాయంత్రం సమావేశం కానుంది. ఈ జూన్ 2తో రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండగా పునర్విభజన చట్టానికి సంబంధించి తెలంగాణ-ఏపీ మధ్య అపరిష్కృతంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చజరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్ట్ 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించగా.. నిధుల సమీకరణపై కూడా చర్చించనున్నారు. 

Also Read: ఆ సొమ్మంతా పేదలకే పంచి పెడతాం.. మోడీ కీలక వ్యాఖ్యలు!

రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా..
Telangana Cabinet Meet: ఇక రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళిక గురించి చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినేట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Telangana Cabinet Meet: కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించగా.. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని రేవంత్ నిర్ణయించారని సమాచారం. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభం కానున్న నేపథ్యంలో స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు