Susmitha sen: అంతా బాగుందనుకున్నాను..కానీ అలా జరిగిపోయింది: మాజీ విశ్వ సుందరి! సుస్మితా తన తల్లిదండ్రులకు గుండె సమస్యలు ఉన్నాయని, జన్యుపరంగా తనకి కూడా ఈ సమస్యలు వస్తాయని ముందుగానే తనకు అవగాహన ఉందని అన్నారు.కానీ ఆకస్మాత్తుగా గుండె నొప్పి రావడం అందరిని షాక్ చేసిందని తెలిపారు. By Bhavana 03 Nov 2023 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ (Susmithasen) ఈ ఏడాది మార్చిలో హార్ట్ ఎటాక్ కు గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెకు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ కూడా వేశారు. అయితే ఇప్పటికే రెండుసార్లు గుండె పరీక్షలు చేయించుకున్నప్పటికీ కూడా ఆమె మరోసారి గుండెపోటుకు గురైనట్లు ఆమె వివరించారు. గుండెకు ఎకో కార్డియోగ్రామ్ టెస్టు చేయించుకున్నప్పుడు కూడా రిపోర్టుల్లో అంతా సరిగానే ఉంది అని వచ్చినప్పటికీ కూడా మరోసారి గుండెనొప్పి వచ్చినట్లు ఆమె వివరించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆరోగ్యానికి సంబంధించి సుస్మితా పలు విషయాలను వెల్లండించారు. Also read: 2 వేల నోట్లను పోస్టులో పంపండి…ఆర్బీఐ మరో బంపర్ ఆఫర్ సుస్మితా తన తల్లిదండ్రులకు గుండె సమస్యలు ఉన్నాయని, జన్యుపరంగా తనకి కూడా ఈ సమస్యలు వస్తాయని ముందుగానే తనకు అవగాహన ఉందని అన్నారు. అందుకే నేను ఏడాదికి రెండుసార్లు కచ్చితంగా గుండెకి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు వివరించారు. నాకు గుండెపోటు రావడానికి 6 నెలల ముందు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కానీ ఆకస్మాత్తుగా గుండె నొప్పి రావడం అందరిని షాక్ చేసిందని తెలిపారు. వ్యక్తిగతంగా గుండెపోటు వచ్చిన తరువాత ఆ దశ అంతా చీకటిగా అనిపించింది. ఆ తర్వాత జీవితం మళ్లీ ప్రారంభం అయినట్లు అనిపిస్తోంది. సుస్మితా సేన్ తాజాగా ఆర్మ 3 వెబ్ సిరీస్ లో నటించారు. అందులో ట్రైలర్ లో ఆమెను చూపినప్పుడు ఆమె బుల్లెట్ తగిలి కిందపడిపోతుంది. అలాంటి బాధనే ఆమె నిజ జీవితంలో కూడా అనుభవించినట్లు పేర్కొంది. ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం ఓ కొత్త దశ అని ఆమె పేర్కొంది. నాకు ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన వారందరికీ కూడా కృతజ్ఙతలు అంటూ ఆమె తెలిపారు. ఇటీవల సుస్మితా దేవి నవరాత్రులు సందర్భంగా ముంబైలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి దుర్గా పూజలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె పండల్ వద్ద డ్యాన్స్ కూడా చేసింది. సుస్మితా చివరి సారిగా తాలీ సినిమాలో కనిపించారు. ఆమె ఆ సినిమాలో ట్రాన్స్ జెండర్ గౌరీ సావంత్ పాత్రలో నటించారు. #bollywood #susmitha-sen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి