Surekha Vani: ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి నటి సురేఖ వాణి ఓ ఇంటర్వ్యూ లో తన భర్త సురేష్ తేజను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. "సురేష్ నాకెంతో గౌరవం ఇచ్చారు. దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తే.. ఆయనతో నా భాదను మొత్తం పంచుకోవాలని ఉంది. తనకు క్షమాపణలు చెప్పాలి అంటూ భావోద్వేగానికి గురయ్యారు". By Archana 14 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Surekha Vani Emotional About Her Husband: నటి సురేఖ వాణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమ్మ, చెల్లి, అక్క, అత్త ఇలా ఏ పాత్రలోనైన ఒదిగిపోయే కొంత మంది నటుల్లో సురేఖ ఒకరు. ఇటు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టీవ్ గా కనిపించే ఈమె.. లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తనంత కూతురు ఉన్నప్పటికీ యంగ్ అండ్ గ్లామరస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటారు. Also Read: Kiran Abbavaram : గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం – రహస్య ఎంగేజ్మెంట్.. వైరలవుతున్న ఫొటోలు భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి అయితే ఎల్లప్పుడూ నవ్వుతూ అలరించే సురేఖ వాణి.. ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో తన భర్తను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె భర్త సురేష్ తేజను (Suresh Teja) గుర్తు చేసుకుంటూ ఇలా మాట్లాడారు.. "మేమిద్దరం ఇష్టపడి వివాహం చేసుకున్నాము. సురేష్ నాకెంతో గౌరవం ఇచ్చారు. దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తే.. ఆయనతో నా భాదను మొత్తం పంచుకోవాలని ఉంది. తనకు క్షమాపణలు చెప్పాలి. ఈ భాద ఎప్పటికీ పోదు.. ఆయన ఇప్పటికీ నాతోనే ఉన్నారని నమ్ముతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు". అలాగే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై కూడా ఆమె స్పందించారు. ట్రోల్స్ పై స్పందించిన సురేఖ సోషల్ మీడియాలో కామెంట్స్ చూసి మొదట్లో చాలా బాధపడ్డాను. ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడం మంచిదని భావించాను. నా కూతురు సుప్రితకు కూడా ఇదే చెబుతుంటాను. ఇప్పుడు ఎవరైనా కామెంట్స్ చేసిన లెక్క చేయను అని అన్నారు. నటి సురేఖ వాణి (Surekha Vani) భర్త సురేష్ తేజ పలు టీవీ సీరియల్స్ కు దర్శకుడిగా వ్యవహరించారు. నాలుగేళ్ల క్రితం పలు అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు. Also Read: RRR Movie: జపాన్‌కు రాజమౌళి.. అక్కడ ఆర్ఆర్ఆర్ క్రేజ్ పీక్స్.. నిమిషంలోపే టికెట్స్ సేల్..! #actress-surekha-vani #surekha-vani-about-her-husband మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి