/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-8-9.jpg)
Rape Case : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ (Suraj Revanna) (37)ను కర్ణాటక పోలీసులు (Karnataka Police) ఆదివారం అరెస్టు చేశారు. బెంగళూరు మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ (HD Deve Gowda) మనవడు, ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడైన సూరజ్.. తనను శారీరకంగా వేధింపులకు గురి చేశాడంటూ జేడీఎస్ కార్యకర్త అయిన 27 ఏళ్ల యువకుడు అత్యాచారం కేసు పెట్టాడు. దీంతో పోలీసులు సూరజ్ ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలిచి అనంతరం అక్కడే అరెస్ట్ చేశారు.
బట్టలు విప్పించి బలవంతంగా దాడి చేసి..
ఈ మేరకు బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. 'సూరజ్ రేవణ్ణ జూన్ 16 సాయంత్రం నన్ను హోలెనరసిపురా తాలూకాలోని గన్నికాడ వద్ద ఉన్న తన ఫామ్‌హౌస్‌కు పిలిచాడు. అక్కడ చాలాసేపు నాతో చాలా చక్కగా మాట్లాడాడు. కానీ తర్వాత నెమ్మదిగా నా భుజంపై చేయి వేసి నా చెవులను తాకడం ప్రారంభించాడు. దీంతో నేను చాలా భయాందోళనకు గురయ్యాను. అది గమనించిన సూరజ్.. 'కంగారుపడవద్దు. నేను మీతోనే ఉంటాను' అని చెప్పాడు. మళ్లీ కాసేపటికి నన్ను తన గదిలోకి తీసుకెళ్లి కౌగిలించుకున్నాడు. నా బుగ్గలు కొరికేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో నాతో నీచంగా మాట్లాడాడు. నా ప్రైవేట్ భాగాలను కూడా తాకాడు. బట్టలు విప్పించి నాతో బలవంతంగా లైంగిక సంబంధం (Sexual Assault) పెట్టుకున్నాడు. సహకరించకుంటే చంపేస్తానని బెదిరించాడు' అని ఆమె పోలీసులకు వివరించినట్లు తెలిపారు.
రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు..
అయితే ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ తోసిపుచ్చాడు. సదరు యువకుడు రూ.5 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వకపోవడం వల్లే ఈ తప్పుడు కేసు పెట్టాడని ఆరోపించాడు. సూరజ్ స్నేహితుడు శివకుమార్ కూడా ఇదే విషయం చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు తనను కూడా సంప్రదించాడని, తనకు రూ.5 కోట్లు ఇప్పించకపోతే సూరజ్ పై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించినట్లు వివరించాడు. వాస్తవానికి తనకో ఉద్యోగం ఇప్పించాలంటూ ఆ కార్యకర్త ముందుగా తనను ఆశ్రయించగా.. తాను సూరజ్ రేవణ్ణ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లి కలవాలని చెప్పానన్నాడు. తమ పార్టీ కార్యకర్త, పార్టీ కోసం కష్టపడే యువకుడు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించేందుకు సూరజ్ ప్రయత్నించాడని వివరించాడు. ఉద్యోగం దొరకడంలో ఆలస్యం కావడంతో ఆ కార్యకర్త తనను, సూరజ్ ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని శివకుమార్ ఆరోపించాడు.
Also Read : హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం