Supreme Court : మనీష్ సిసోడియాకు బెయిల్

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. కాగా ఈ కేసులో సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరి 26న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 17 నెలలుగా సిసోడియా జైలులో ఉన్నారు.

New Update
Supreme Court : మనీష్ సిసోడియాకు బెయిల్

Supreme Court Grants Bail To Manish Sisodia : లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) కు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఈ కేసులో సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరి 26న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 17 నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు. తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దేశం విడిచి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని చెప్పింది.


Also Read : కవిత సీబీఐ చార్జిషీట్‌పై నేడు విచారణ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు

మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ పై చాలా పెద్ద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు మార్క్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చైనాతో చేతులు కలిపి అమెరికన్ల మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

New Update
meta

meta

అసలే ఒక పక్క అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. దానికి తోడు మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఇందులో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ మీదనే ఏకంగా సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. జుకర్ బర్గ్ అమెరికా జాతీయ భద్రత గురించి ఆలోచించలేదని...అమెరికన్లను మోసం చేస్తున్నారని మెటాలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్‌ అధికారుల చేతుల్లోకి వెళుతోందని అన్నారు. 

మెటా చైనాతో చేతులు కలిపింది..

మెటా ఇప్పటికే చాలా ప్రాబ్లెమ్స్ ను ఎదుర్కొంటోంది. గోప్యతా విధానం, అనైతిక వ్యాపా విలువలు లాంటి అంశాల్లో మెటా యూఎస్ కాంగ్రెస్ ఎదుట విచారణను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే మెటా మాజీ ఉద్యోగి సారా విన్ విలియమ్స్ వెట్ నెస్ గా మారి జుకర్ బర్గ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అప్పుడే ఆయనపై విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు. మెటా ఎగ్జిక్యూటివ్ లు పదేపదే జాతీయ భద్రతను అణగదొక్కారని...అమెరికా విలువలకు ద్రోహం చేయండ తాను చూశానని విలియమ్స్ చెప్పారు. మెటా చైనీస్‌ ప్రభుత్వం కోసం కస్టమ్‌ సెన్సార్‌షిప్‌ టూల్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ టూల్స్‌తో కంటెంట్‌పై విస్తృత నియంత్రణ లభిస్తుందని చెప్పారు. జుకర్ బర్గ్ అమెరికా దేశ భక్తుడు అని చెబుతారు కానీ చైనాలో 18 బిలియన్ డాలర్ల   వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని తెలిపారు. అమెరికన్లు సహా మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం తెలుసుకునేలా మెటా ఎగ్జిక్యూటివ్‌లు నిర్ణయాలు తీసుకొంటున్నారని విలియమ్స్ ఆరోపించారు.

today-latest-news-in-telugu | meta | mark-zuckerberg

Also Read: US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?

 

Advertisment
Advertisment
Advertisment