Supreme Court : ఓటు కు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదిక చేయవద్దని ఆయనను న్యాయస్థానం మందలించింది.

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

Alla Ramakrishna Reddy : తెలంగాణ (Telangana) లోని ఓటుకు నోటు కేసు (Vote For Note Case) లో సుప్రీంకోర్టు (Supreme Court) కు వెళ్లిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ఆయన వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టేవేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేయడమే కాకుండా ఆళ్ల రామక్రిష్ణా రెడ్డిని కూడా మందలించింది. ఆ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. రాజకీయ కక్ష్య సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చుకోవద్దంటూ రామకృష్ణ రెడ్డిని జస్టిస్‌ సుందరేష్‌ ధర్మాసనం హెచ్చరించింది.

Also Read: అనాథ శవాలతో వ్యాపారం.. కోల్‌కతా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్రమాలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు