Fact Check Unit: ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్ పై సుప్రీం కోర్టు స్టే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నిబంధనలు 2023 ప్రకారం ఫాక్ట్-చెక్ యూనిట్ (FCU) యూనియన్ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం (మార్చి 21) స్టే విధించింది. By KVD Varma 21 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నిబంధనలు 2023 ప్రకారం ఫాక్ట్-చెక్ యూనిట్ (FCU) యూనియన్ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం (మార్చి 21) స్టే విధించింది. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం మార్చి 20న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 2023లో చేసిన ఐటీ నిబంధనల సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పరిధిలోని ఫ్యాక్ట్-చెక్ యూనిట్‌కు కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత ఏజెన్సీలకు సంబంధించిన తప్పుడు సమాచారం అని ఫ్లాగ్ చేసే హక్కు , అధికారం ఉంటుందని బుధవారం జారీ చేసిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ - ఐటీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ఫాక్ట్ చెక్ యూనిట్ (Fact Check Unit)దాని కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థగా వ్యవహరిస్తోంది. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న సమాచారం ప్రామాణికతను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం నొక్కి చెబుతుంది.హాస్యనటుడు కునాల్ కమ్రా - ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటీషన్ పై విచారించిన బొంబాయి హైకోర్టు ఈ యూనిట్ స్థాపనను నిలువరించకూడదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, పిటిషనర్లు ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. దీనిపై సుప్రీంలో గురువారం విచారణ జరిగింది. విచారణ అనంతరం సుప్రీం కోర్టు నోటిఫికేషన్ తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. వార్త అప్ డేట్ అవుతోంది... #supreme-court #fact-check-unit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి