Sunita Kejriwal: ఆ వివాదంలో చిక్కుకున్న కేజ్రీవాల్ భార్య సునీత

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత వివాదంలో చిక్కుకున్నారు. స్వాతి మలివాల్‌ కేసులో బెయిలుపై విడుదలైన బిభవ్ కుమార్ ఫోటోను Xలో ఆమె షేర్ చేశారు. దీనిపై స్వాతి మలివాల్ బాధితులను నాశనం చేయడం.. నిందితులకు బెయిల్ ఇప్పించడమే వారి పని అంటూ తీవ్రంగా స్పందించారు. 

New Update
Sunita Kejriwal: ఆ వివాదంలో చిక్కుకున్న కేజ్రీవాల్ భార్య సునీత

Sunita Kejriwal ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో బిభవ్ కుమార్ ఫోటోను షేర్ చేయడం వివాదానికి దారితీసింది. ఆమె పోస్ట్‌పై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆరోపణలు చేశారు  స్వాతి మలివాల్.  ఆమె ఆరోపణలపైనే బిభవ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. మలివాల్‌పై దాడి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన ఒక రోజు తర్వాత, సెప్టెంబరు 3న, CM అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ తీహార్ జైలు నుండి విడుదలయ్యారు. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కుమార్ 100 రోజులకు పైగా కస్టడీలో ఉన్నారనే కారణంతో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడులయ్యారు. 

ఆయన విడుదలైన తర్వాత, సునీతా కేజ్రీవాల్ X లో ఒక పోస్ట్ చేశారు. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ కమ్యూనికేషన్ ఇంచార్జి విజయ్ నాయర్ - కుమార్ ఒక గదిలో కలిసి కూర్చున్న చిత్రాన్ని పోస్ట్ చేసి, హిందీలో "ఒక ప్రశాంతమైన రోజు" అని రాశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రమేయం ఉన్నందున 22 నెలల పాటు తీహార్ జైలులో ఉన్న నాయర్ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 3న విడుదలయ్యారు. నిజానికి మే 13న కేజ్రీవాల్ అధికారిక నివాసంలో కుమార్ తనపై దాడికి పాల్పడ్డారని మలివాల్‌ ఆరోపణలు చేశారు. దీంతో మే 18న ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

సునీతా కేజ్రీవాల్ షేర్ చేసిన చిత్రంపై స్పందిస్తూ, "నన్ను కుమార్ కొట్టినపుడు  ఇంట్లో ఉన్న ముఖ్యమంత్రి భార్య చాలా 'రిలీఫ్'గా ఉంది" అని మలివాల్ ఎక్స్‌లో రాశారు. "ఇది అందరికీ స్పష్టమైన సందేశం, మహిళలను కొట్టండి, ఆ తర్వాత మేము మొదట డర్టీ ట్రోలింగ్ చేస్తాము, బాధితుడిని పూర్తిగా నాశనం చేస్తాము. నేరం చేసిన ఆ వ్యక్తిని కోర్టులో రక్షించడానికి దేశంలోని అత్యంత ఖరీదైన న్యాయవాదుల సైన్యాన్ని నియమిస్తాము" అని ఆమె ఎక్స్ లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. .

మే 16న కుమార్‌పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) దాఖలు అయింది. అభియోగాలలో భారతీయ శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్లు ఉన్నాయి. కుమార్‌పై నేరపూరితమైన బెదిరింపు, దాడి లేదా నేరారోపణలు చేయాలనే ఉద్దేశ్యంతో ఒక మహిళపై నేరారోపణలు, నేరపూరిత హత్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment