Dhanush : 'రాయన్' సక్సెస్.. ధనుష్ కు నిర్మాత సర్ప్రైజ్ ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాయన్' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో నిర్మాత కలానిథి మారన్ ధనుష్‌ని కలిసి సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ.. కానుకగా రెండు చెక్కులు అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. By Anil Kumar 23 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Kollywood Actor Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాయన్'. జులై 26న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని చేసుకుంది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ చిత్రంలో ధనుష్ నటన, సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈక్రమంలోనే మూవీ సక్సెస్ సందర్భంగా నిర్మాత కళానిధి మారన్ ధనుష్‌ని కలిసి సర్ప్రైజ్ చేశారు. ధనుష్‌ని అభినందించిన ఆయన కానుకగా రెండు చెక్కులు (డైరెక్టర్, హీరో కావడంతో) అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Mr. Kalanithi Maran congratulated @dhanushkraja for the grand success of #Raayan and presented 2 cheques to him - one for the hero and one for the director. pic.twitter.com/gp12Z8s6bl — Sun Pictures (@sunpictures) August 22, 2024 Also Read : అక్కినేని నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయం!? సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో ధనుష్ తో పాటూ టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, దూషారా విజయన్, SJ సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రల్లో కనిపించగా.. ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ సంగీతం అందిచారు. మరోవైపు థియేటర్ లో సక్సెస్ అయిన ఈ మూవీ శుక్రవారం నుంచి ‘అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది #actor-dhansuh #raayan-movie సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి