Summer: తెలంగాణాలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఏకంగా ఆరు జిల్లాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.మరో రెండు మూడు రోజుల పాటూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

New Update
Summer: తెలంగాణాలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

ప్రస్తుతం తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేశాయి.. మరో రెండు మూడు రోజుల పాటూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దని.. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, మంచిర్యాల జిల్లా హాజిపూర్‌ మండలాల్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి నల్గొండ జిల్లాలో గత పదేళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని తెలుస్తోంది. మరో ఐదు జిల్లాల్లో 44.9 డిగ్రీలు, నాలుగు జిల్లాల్లో 44.8 డిగ్రీలు నమోదు కావడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.గురువారం ఆరు జిల్లాల్లోని 17 మండలాల్లో వడగాలులు వీచాయి. నల్గొండ జిల్లా అనుముల హాలియా, నాంపల్లి, తిరుమలగిరి(సాగర్‌). సూర్యాపేట జిల్లా మఠంపల్లి, పాలకేడు, నూతన్‌కల్‌, మునగాల. వరంగల్‌ జిల్లా ఖిల్లా వరంగల్‌, దూగొండి, చెన్నారావుపేట. సిద్దిపేట జిల్లా ధూల్‌మిట్ట, సిద్దిపేట పట్టణం. భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌, కొత్తగూడెం, చండ్రుగొండ. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చేర్యాల, రేగొండ మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి.

తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని జిల్లాల్లో 41-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. 21న గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో.., 22న ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో 40 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 19, 20, 21 తేదీల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచాన వేస్తున్నారు45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన జిల్లాల్లో వృద్ధులు, చిన్నారులు, రోగులకు ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడం మంచిదంటున్నారు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగడం మంచిందని సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు