Harom Hara : ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ 'హరోం హర'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' మూవీ ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదట ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు. కానీ జులై 11 నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' పోస్టర్ తో అధికారికంగా ప్రకటించింది. By Anil Kumar 09 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Sudheer Babu's Harom Hara Movie Coming On OTT : గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ గా వచ్చిన 'హరోం హర' మూవీతో హిట్ అందుకున్నాడు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. సినిమా చూసిన చాలామంది ఇన్నాళ్లకు సుధీర్ బాబు కటౌట్ తగ్గ సినిమా పడిందని అన్నారు.అందుకు తగ్గట్లు గానే సుధీర్ బాబు సినిమాలో తన ఊరమాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. కుప్పం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా జూన్ 14న థియేటర్లలోకి వచ్చింది. 'పుష్ప', 'కేజీఎఫ్' లాంటి చిత్రాలని పోలినట్లు ఉందని టాక్ రావడం వల్ల ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మొదట ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు. Balavanthudiki ayudham avasaram..🤨 Kaani baalaheenudiki Ayudhame balam!⚔️#HaromHara Premieres July 11th only on aha!@isudheerBabu @ImMalvikaSharma @suneeltollywood @gnanasagardwara @chaitanmusic @SumanthnaiduG @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/Klf0BsDStc — ahavideoin (@ahavideoIN) July 8, 2024 ఆహాలో.. కానీ ఇప్పుడు 'ఆహా' ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. 'హరోం హర' జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు 'ఆహా' పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఈ సినిమాతో సుధీర్ బాబుకు 'నవ దళపతి' అనే సరికొత్త ట్యాగ్ ఇచ్చారు మేకర్స్. 'హరోం హర' క్లైమాక్స్ ఎండింగ్ లో ఈ ట్యాగ్ ను చూపించారు. ఇక నుంచి సుధీర్ బాబు తదుపరి సినిమాలన్నింటికీ ఈ ట్యాగ్ కంటిన్యూ అవుతుందేమో చూడాలి. #sudheer-babu #harom-hara-movie-on-ott మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి