Sudheer Babu : పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సైన్ చేసిన సుధీర్ బాబు.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న మూవీ, డైరెక్టర్ ఎవరంటే? యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాకు సంతకం చేశాడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్ కల్యాణ్ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన స్టోరీలైన్‌తో కొత్త స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. By Anil Kumar 01 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Sudheer Babu Signs Pan India Project : గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ గా వచ్చిన 'హరోం హర' మూవీతో హిట్ అందుకున్నాడు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. సినిమా కూసిన చాలామంది ఇన్నాళ్లకు సుధీర్ బాబు కటౌట్ తగ్గ సినిమా పడిందని అన్నారు.అందుకు తగ్గట్లు గానే సుధీర్ బాబు సినిమాలో తన ఊరమాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. ఇక తాజాగా ఈ హీరో ఓ పాన్ ఇండియా సినిమాకు సంతకం చేశాడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్ కల్యాణ్ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన స్టోరీలైన్‌తో కొత్త స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. రుస్తుం, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్, పారి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించిన ప్రేర్నా అరోరా ఓ లీడింగ్ స్టూడియోతో కలిసి తెరకెక్కిస్తుండటం అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తుండగా.. త్వరలోనే ప్రకటన కూడా ఉండబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది. Also Read : మరో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్.. టైటిల్ కూడా ఫిక్స్! ఇక 2025 మార్చిలో శివరాత్రి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి సుధీర్‌బాబు మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమా స్క్రిప్ట్ చాలా నచ్చింది. ఏడాది నుంచి ఈ టీమ్‌తో కలిసి ట్రావెల్ చేస్తున్నా. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రేక్షకుల మనసును హత్తుకునే సినిమా ఇది" అని అన్నాడు. #sudheer-babu #sudheer-babu-pan-india-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి