వారు కూలీలు కాదు.. విద్యార్థులే!

విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. బుక్స్ పట్టుకోవాల్సిన పిల్లలు పలుగుపార పట్టుకున్నారు. విద్యావంతులుగా మార్చాల్సిన ఉపాధ్యాయులే కూలీ పనులు చేయిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

New Update
వారు కూలీలు కాదు.. విద్యార్థులే!

పుస్తకాలు పట్టించాల్సిన పిల్లల చేత పలుగుపార పట్టించి దినసరి కూలీలుగా మార్చేశారు. చేతులు కాయలు కాసేలా మట్టి పనులు చేయించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని బాదేపల్లి బాలుర ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. విద్యార్థులను విద్యావంతులుగా మార్చాల్సిన ఉపాధ్యాయులే కూలీలుగా మారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పాఠశాల ప్రహరీ గోడ కూలిపోవడంతో విద్యార్థులు బయటికి వెళ్తున్నారని కంచె కట్టేందుకు నిర్ణయించారు. అయితే కూలీలను పెట్టి చేయించుకోవాల్సిన పనిని.. ఖర్చు అవుతుందని కక్కుర్తి పడి విద్యార్థుల చేత చేయించారు. దీంతో పిల్లలు పలుగుపార పట్టుకుని పనిచేయడంతో వారి చేతులకు దెబ్బలు తగిలాయి. బాలలు చేత పనిచేయించడం నేరం అని తెలిసినా కూడా ఇలా వెట్టిచాకరి చేయించడంపై పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా గంగారం మండల కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన ఓ బడా నాయకుడు, గుత్తేదారు కూడా ఇలాగే రెచ్చిపోయాడు. కామారం గ్రామం నుండి అందుగుల గూడెం మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న బిటీ రోడ్డు నిర్మాణ పనుల్లో కంకర లేవలింగ్, వాటర్ ట్యాంకర్ సహాయంతో నీళ్లు కొట్టడటానికి చిన్నారులను వినియోగించుకున్నారు. స్కూలు పిల్లలు అనే కనికరం కూడా లేకుండా రోడ్డు పనుల్లో కూలీలుగా మార్చి వారి బ్రతుకులను ఛిద్రం చేస్తున్న సదరు కాంట్రాక్టర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ రోడ్డు పనులను పర్యవేక్షణ నిమిత్తం వెళ్లే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సైతం ఆ బాల కార్మికుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించటం గమనార్హం. తక్షణమే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు