TG Education : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రీ వెరిఫికేషన్ కు ఇంటర్ బోర్డ్ అనుమతి!?

రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ ఇయర్ లో 99 మార్కులొచ్చి సెకండ్ ఇయర్ లో 70 దాటకపోవడంతో మూల్యాంకనంలో తేడా జరిగిదంటూ ఇంటర్ బోర్డును ఆశ్రయిస్తున్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

New Update
TG Education : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రీ వెరిఫికేషన్ కు ఇంటర్ బోర్డ్ అనుమతి!?

Telangana : తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల (Inter Students) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫస్ట్ అంట్ సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు (Inter Exams) రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చూసి ఖంగుతింటున్నారు. ఎంతో కష్టపడి రాసిన పరీక్షల్లో ఊహించని విధంగా తక్కువ మార్కులు రావడతో ఆందోళన చెందుతున్నారు. కొంమంది విద్యార్థులు తమ మార్కులు చూసుకుని బోరున ఏడ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 100కు 98,99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు సెకండ్ ఇయర్ లో 70 దాటకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీ వెరిఫికేషన్ కోసం ఇంటర్‌ బోర్డుకు క్యూ కడుతున్నారు.

48 వేల మంది రీ వెరిఫికేషన్ ధరఖాస్తు..
ఈ మేరకు ఈ యేడాది ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వెలువడిన తర్వాత దాదాపు 48 వేల మంది రీ వెరిఫికేషన్ (Re-Verification) కు, మరో 2 వేల మంది రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తాము రాసిన ఆన్సర్ షీట్స్ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, చెక్ చేసుకున్న తర్వాత ఇంటర్‌బోర్డు తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ కు చెందిన ఎంఈసీ విద్యార్థినికి మొత్తం 926 మార్కులు వచ్చాయి. మొదటి సంవత్సరం కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ పేపర్‌లో 100కి 98 వచ్చాయి. సెకండియర్‌లో 77 మాత్రమే రావడం విశేషం. కాగా వాస్తవానికి ఆ సబ్జెక్టులో ఆమె వేసుకున్న లెక్క ప్రకారం కనీసం 95 మార్కులు రావాలని, దీంతో ఆమె రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుంది. కానీ మార్కుల్లో ఎటువంటి మార్పు లేదని ఇంటర్‌బోర్డు సమాచారం ఇచ్చింది. అనంతరం జవాబుపత్రాన్ని ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థిని డౌన్‌లోడ్‌ చేసుకున్న విద్యార్థిని.. మొదట 97 మార్కులు వేసి తర్వాత దాన్ని 77గా మార్చినట్లు గుర్తించింది. పలు ప్రశ్నలకు మొదట ఇచ్చిన మార్కుల్ని దిద్దినట్లు ఓఎంఆర్‌ షీట్‌లో స్పష్టమైంది. దీనిపై వెంటనే ఉన్నతాధికారులను కలవగా.. ఈ విద్యార్థిని మార్కుల విషయంపై చర్చింది తుది నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారు తెలిపారు. దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారి జవాబుపత్రాలను నిపుణులకు చూపించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read : ఈ జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు.. 1666 మంది ట్రబుల్ మాంగర్స్.. 150 కేసులు : SP

యూనివర్సిటీల్లో కనీస మార్కుల నిబంధన..
పలు ప్రైవేట్ యూనివర్సిటీల్లో (Private Universities) ఇంటర్‌లో మంచి మార్కులుంటేనే బీటెక్, ఇతర కోర్సుల్లో ఫీజు లేకుండా సీట్లు ఇస్తున్నారు. మరికొన్ని వర్సిటీలు కనీస మార్కుల నిబంధన విధించాయి. ఈ క్రమంలో తాము మూల్యాంకనంలో జరుగుతున్న అవకతవకలతో చాలా నష్టపోతున్నామని వాపోతున్నారు. కొన్ని కార్పొరేట్, పలు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు పేపర్ల మూల్యాంకనానికి ట్యూటర్లను, జూనియర్‌ లెక్చరర్లను పంపుతున్నారు. వారికి సరైన జ్ఞానం, అవగాహన లేక తప్పుడు మార్కులు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనంపై దృష్టి పెట్టడం లేదని, మార్కులు తేడా వస్తే జరిమానా వేసి చేతులు దులిపేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల యాజమాన్యాలకు కూడా నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు