AP: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. కుటుంబ సభ్యుల ఆందోళన..! నెల్లూరు: చింతారెడ్డిపాలెంలోని నారాయణ డెంటల్ కాలేజీలో ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ బిడ్డ ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాహుల్ అనే విద్యార్థి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రదీప్ మెసేజ్ పెట్టినట్లు చెబుతున్నారు. By Jyoshna Sappogula 14 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Nellore: నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెంలోని నారాయణ డెంటల్ కాలేజీలో ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందాడు. మృతుడు ప్రదీప్.. అనంతపురం జిల్లా తాడిపత్రి వాసి. నారాయణ డెంటల్ కాలేజీలో BDS సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. Also Read: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్.. వివాదంలోకి మరో కొత్త వ్యక్తి ఎంట్రీ! విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హుటాహుటినా కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డ ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం అని ఆందోళన చేపట్టారు. రాహుల్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి సెక్సువల్ హరాస్ మెంట్ కి పాల్పడ్డాడని ఆరోపించారు. Also Read: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..! రాహుల్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని విద్యార్థి ప్రదీప్ తన సోదరుడికి మెసేజ్ పెట్టినట్లు తెలుస్తుంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మార్చురీ వద్ద బంధువులు నిరసన చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. #nellore సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి