/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/stones-jpg.webp)
Stones in Amazon Order: దసరా పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల మీద భారీ డిస్కౌంట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లూరి జిల్లా రాజవోమ్మంగి కిమ్మిగడ్డ గ్రామానికి చెందిన ఓ యువకుడు రూ. 6 వేలకు ఐటెల్ ఏ 60 ఎస్ ఫోన్ ను ఆర్టర్ పెట్టగా..ఆ పార్సిల్ లో వచ్చిన దానిని చూసి యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
వివరాల ప్రకారం.. మహమ్మద్ బాషా అనే యువకుడు అమెజాన్లో (Amazon) దసరా ఆఫర్ల సందర్భంగా రూ. 6 వేలకు ఐటెల్ ఏ 60 ఎస్ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ అక్టోబర్ 20 వ తేదీన దానికి సంబంధించిన పార్సిల్ తీసుకుని వచ్చి యువకునికి ఇవ్వగా అది తేలికగా అనిపించింది. కదిలించి చూడగా లోపల ఏదో ఊగుతున్నట్లు అనిపించింది.
Also read: ధోని పేరు చెప్పి..పాపను ఎత్తుకుపోయారు!
దీంతో అనుమానం వచ్చిన ఆ యువకుడు తన స్నేహితుడికి చెప్పగా అతను డెలివరీ బాయ్ తీసుకుని వచ్చిన పార్సిల్ ను ఫోన్ లో వీడియో తీస్తూ ఓపెన్ చేయాలని సూచించాడు. అతను అలాగే చేయగా.. ఆ పార్సిల్ లోపల రెండు రాళ్లు వచ్చాయి. దీంతో డెలివరీ బాయ్ సంస్థ అధికారులతో మాట్లాడాడు. దీంతో వారు వెంటనే ఆ రీప్లేస్ చేయమని చెప్పడంతో అతను అలాగే చేశాడు.
ఇలా డెలివరీ పార్సిల్స్ లో రాళ్లు రావడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఆర్డర్ చేసిన ఐటమ్ బదులుగా రాళ్లు, సబ్బులు వచ్చాయి.
Also read: మునుగోడు నుంచే పోటీ చేస్తా.. నా లక్ష్యం అదే: రాజగోపాల్ రెడ్డి!