Yadla Tataji: పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్ లేదు.. షర్మిల ఎక్కడ పోటీ చేసినా అంతే.. యడ్ల తాతాజీ కీలక వ్యాఖ్యలు మూడు పార్టీలు కాదు ఎన్ని పార్టీలు కలిసొచ్చినా విజయం వైసీపీదేనన్నారు రాష్ట్ర పంచాయితీ రాజ్ కార్యదర్శి యడ్ల తాతాజీ. పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్ లేదని.. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని విమర్శలు గుప్పించారు. షర్మిల ఎక్కడ పోటీ చేసిన ఓటమి ఖాయమన్నారు. By Jyoshna Sappogula 06 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Panchayat Raj Secretary Yadla Tataji: రాష్ట్ర పంచాయితీ రాజ్ కార్యదర్శి, మాజీ డిసియంఎస్ ఛైర్మెన్ యడ్ల తాతాజీ ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఇద్దరు వ్యక్తులు, రెండీ పార్టీలు కలిసినంత మాత్రనా సీఎం జగన్ ను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించలేరని కామెంట్స్ చేశారు. మూడు పార్టీలు కాదు ఇంకొక నాలుగు పార్టీలు కలసి వచ్చినా విజయం వైసీపీ దేనని ధీమా వ్యక్తం చేశారు. Also Read: గుడిసెకు రూ. 62, 969 వేల కరెంట్ బిల్లు..ఉలిక్కిపడ్డ కుటుంబ సభ్యులు..! టీడీపీ జనసేన పార్టీ అజెండా లేని పార్టీలని విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అసలు రాజకీయ భవిష్యత్ లేదని జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని విమర్శలు గుప్పించారు. ఈ రెండీ పార్టీలు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాలు చూసి ఓర్వలేకపోతున్నారని అందుకే లేని పోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ అనే సింహమేనన్నారు. Also Read: ఏపీలో సర్పంచుల ఆందోళన.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు..అరెస్ట్ చేసిన పోలీసులు ఈ క్రమంలోనే ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె ఎక్కడ పోటీ చేసిన ఓటమి ఖాయమన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ఎవ్వరు మర్చిపోలేదని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజల్ని మోసం చేసేందుకు అనేక జిమ్మిక్కులు పన్నుతాడని దుయ్యబట్టారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి