AP: ''నాకు మార్కులు వేయకపోతే.. మా తాతతో చేతబడి చేయిస్తా''..పదో తరగతి విద్యార్థి మాస్‌ వార్నింగ్‌!

బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి షాక్‌ అయ్యారు. ఎందుకంటే ఆ సమాధానం ఏంటంటే.. ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని ఉండటం చూసి..టీచర్ అవాక్కయ్యారు.

New Update
AP: ''నాకు మార్కులు వేయకపోతే.. మా తాతతో చేతబడి చేయిస్తా''..పదో తరగతి విద్యార్థి మాస్‌ వార్నింగ్‌!

AP: ఇటీవల కాలంలో విద్యార్థులు పరీక్ష ఆన్సర్‌ షీట్లలో రాసే సమాధానాలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతున్నాయి. సాధారణంగా పరీక్షలంటే విద్యార్థుల్లో ఎంత టెన్షన్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు పరీక్షలకు ముందు ప్రణాళికతో ప్రిపేర్‌ అవుతారు. మరికొందరు ఏదో వెళ్లి పరీక్ష రాసివచ్చాం అన్నట్లుగా ఉంటారు.

సాధారణంగా పరీక్షల్లో ప్రశ్నాపత్రంలో వచ్చిన ప్రశ్నలకు చాలా మంది ఏం రాయాలో తెలియకపోయినా సినిమా కథలో, పాటలో.. కథలు.. లేకపోతే ఉపాధ్యాయుడిని కాకపట్టేందుకు ఏవో ఇబ్బందులను చెబుతూ జవాబులు రాసేది మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. , తాజాగా పరీక్షకు హాజరైన విద్యార్థి ఓ ప్రశ్నకు రాసిన సమాధానం చూసి మాస్టర్‌ బెంబెలెత్తిపోయారు.

బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి షాక్‌ అయ్యారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అనే ప్రశ్నకు ఓ విద్యార్థి రాసిన వింత సమాధానం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.ఇంతకి అందులో ఏముందంటే ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని ఉండటం చూసి..టీచర్ అవాక్కయ్యారు. వెంటనే జవాబు పత్రాన్ని ఉన్నతాధికారులకు చూపించారు.

అయితే, ఆ విద్యార్థికి ఈ సబ్జెక్టులో 70 మార్కులు వచ్చాయి. మరో ఆన్సర్ షీట్‌లో రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు.. ‘మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాయడంతో.. ఉపాధ్యాయులు నవ్వుల్లో మునిగి తేలారు.

Also read: నటిని అక్కడ టచ్ చేసిన బోనీ కపూర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు