Sri Lanka Cricket: శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు...భారత్ చేతిలో పరాభవమే కారణం

ప్రపంచకప్ లో శ్రీలంక అస్సలు సరిగ్గా ఆడటం లేదు. అంతేకాదు భారత్ చేతిలో చాలా ఘోరంగా ఓడిపోయింది కూడా. దీంతో తీవ్ర విమర్శలు పాలయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

New Update
Sri Lanka Cricket: శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు...భారత్ చేతిలో పరాభవమే కారణం

Sri Lanka Cricket Board: భారత్ చేతిలో శ్రీలంక రెండు ఘోరంగా దెబ్బతింది. ఆసియా కప్ లో చేసిన తప్పును సరిదిద్దుకుంటుందేమో అనుకున్నారు కానీ ప్రపంచ కప్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. దాంతో పాటూ మొత్తం వరల్డ్ కప్ లో (World Cup 2023) లంకేయుల ఆట తీరు అస్సలు ఏమీ బాగోలేదు. ఈ పరిస్థితి ఇప్పుడు ఏకంగా శ్రీలంక క్రికెట్ బోర్డుకే ఎసరు పెట్టింది. ఇప్పటికే బోర్డు కార్యదర్శి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా లంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నామని శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

Also Read: అతను నా గురువు..సచిన్ అంత గొప్ప ఆటగాడిని కాను-విరాట్

క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్టు శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే (Roshan Ranasinghe) తెలిపారు. మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ (Arjuna Ranatunga) నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా ఉన్నారు. బోర్డు రద్దు గురించి క్రీడల మంత్రి మాట్లాడుతూ అందులో సభ్యులకు పదవిలో ఉండే అర్హత, హక్కు లేదని అన్నారు. వెంటనే వారందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బావుండేది. బోర్డులో అవినీతి మితిమీరింది. అందుకే బోర్డును తొలగించాల్సి వచ్చిందని చెప్పారు మంత్రి రణసింగే. బోర్డు మీద దాడులు జరిగే అవకాశం ఉందని అందుకే పోలీసులతో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయించామని తెలిపారు.

వరల్డ్ కప్ లో ముంబయ్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 358 పరుగులు చేయగా శ్రీలంక కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో వరల్డ్ కప్ లో నాలుగో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా శ్రీలంక నిలిచింది. అంతకు ముందు ఆసియా కప్ (Asia Cup) లోనూ 50 పరుగులకే ఆలౌట్ అయ్యారు లంకేయులు.

Also Read: నేను కెప్టెన్‌ కావాల్సింది.. ధోనీ నాకు క్లోజ్ కాదు.. యువరాజ్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు