Sri Lanka : తమిళనాడు మత్స్యకారులను అరెస్ట్‌ చేసిన శ్రీలంక నేవీ!

శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటను సాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్‌ చేసింది.అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకు శ్రీలంక నేవీ పెట్రోల్ బోట్లు వారిని చుట్టుముట్టి.. ఎనిమిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి.

New Update
Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ అరెస్ట్‌!

Sri Lanka Navy Arrested Fishermen's : తమిళనాడు (Tamilnadu) లోని ఫిషింగ్‌ ఓడరేవును వదిలి శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటను సాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను (Fishermen) శ్రీలంక నేవీ అరెస్ట్‌ చేసింది. మత్స్యకారులు తెల్లవారుజామున బయలుదేరి ధనుష్కోడి, తలైమన్నార్ సమీపంలో చేపలు పడుతుండగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకు శ్రీలంక నేవీ (Sri Lanka Navy) పెట్రోల్ బోట్లు వారిని చుట్టుముట్టి.. ఎనిమిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి.

అంతేకాకుండా వారి వద్ద నుంచి ఓ బోటును కూడా స్వాధీనం చేసుకున్నాయి. సోమవారం రామేశ్వరం (Rameshwaram) నుంచి 430 మెకనైజ్డ్ బోట్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లాయి. అందులో ఉన్న ఎనిమిది మంది సిబ్బందితో పాటు ఓ పడవను కూడా నేవి అధికారుఉల పట్టుకున్నట్లు రామేశ్వరం షిషరీస్ అసిస్టెంట్‌ డైరెక్టర్ ప్రకటించారు.

అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటుతున్నారనే నెపంతో 72 రోజుల్లో శ్రీలంక నావికాదళం కనీసం 163 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చల తరువాత అరెస్టైన మత్స్యకారులందరినీ బ్యాచ్‌ల వారీగా శ్రీలంక విడుదల చేస్తుంది.

Also Read: ‘ఇంద్ర’ మూవీ టైం లో చిరంజీవి ఏజ్ ఎంతో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు