దాయాదిని చిత్తు చేసిన భారత్!

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. దాయాది పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 7బంతులు మిగిలుండగానే 106 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది. 

New Update
dede

T20 world cup: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. దాయాది పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఏడు బంతులు మిగిలి ఉండగానే 106 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది. 

ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (32; 35 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (29* రిటైర్డ్ హర్ట్), జెమీమా రోడ్రిగ్స్ (23) రాణించారు. పాక్‌ బౌలర్లలో ఫాతిమా 2, సాదియా ఇక్బాల్, ఒమైమా తలో వికెట్ పడగొట్టారు. భారత్‌ మూడో మ్యాచ్‌ అక్టోబర్‌ 9న శ్రీలంకతో ఆడనుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు