/rtv/media/media_files/2026/03/12/varun-2026-03-12-16-08-33.jpg)
టీ20 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించడంతో ఆటగాళ్లు ఆధ్యాత్మిక బాట పట్టారు. క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ తమ మొక్కును చెల్లించుకున్నారు. తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం (మార్చి 11) సాయంత్రం తిరువణ్ణామలైలోని అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
వరల్డ్ కప్ గెలవాలని ముందుగానే మొక్కుకున్న ఈ క్రికెటర్లు, అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణను పూర్తి చేశారు. సామాన్య భక్తులతో కలిసి కాలినడకన కొండ చుట్టూ తిరుగుతున్న వీరి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులతో కలిసి సరదాగా ఫోటోలు దిగుతూ తమ గిరిప్రదక్షిణ పూర్తి చేశారు. అనంతరం వారు అరుణాచలేశ్వర ఆలయంలో శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Indian team cricketers Varun Chakravarthy & Washington Sunder fulfilled their vow of doing Girivalam in Thiruvannamalai
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) March 12, 2026
Girivalam is a sacred 14-kilometre circumambulation (walking around) of the Arunachala Hill in Tiruvannamalai, Tamil Nadu.The hill itself is considered a… pic.twitter.com/rtEFP9Mnnr
వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన
ఈ ప్రపంచకప్ టోర్నీలో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన కనబరిచారు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి టోర్నీలోనే జాయింట్ హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచారు. గ్రూప్ దశలో తన స్పిన్‌తో ప్రత్యర్థులను వణికించిన వరుణ్, కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ నెదర్లాండ్స్, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో జట్టులో భాగంగా ఉన్నారు.
ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతున్నారు. వరుణ్ చక్రవర్తిని కోల్‌కతా నైట్ రైడర్స్ 12 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకోగా, వాషింగ్టన్ సుందర్‌ను గుజరాత్ టైటాన్స్ 3.2 కోట్ల రూపాయలకు అట్టిపెట్టుకుంది. త్వరలోనే వీరిద్దరూ తమ జట్ల శిక్షణ శిబిరాల్లో చేరనున్నారు. ప్రపంచకప్ విజయం ఇచ్చిన జోష్‌తో, అరుణాచలేశ్వరుడి ఆశీస్సులతో ఐపీఎల్‌లోనూ సత్తా చాటాలని ఈ తమిళనాడు స్పిన్నర్లు భావిస్తున్నారు.
Follow Us