లంకతో తలపడనున్న భారత్.. భారీ తేడాతో గెలిస్తేనే.. టీ20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిన రెండో మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది. నేడు శ్రీలంకతో తలపడనున్న ఈ మ్యాచ్‌లో ఇండియా భారీ రన్‌రేట్‌తో గెలిస్తేనే జట్టు సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. By Kusuma 09 Oct 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 3న ప్రారంభమైంది. బంగ్లాదేశ్ బోణీ కొట్టగా.. శ్రీలంక మీద పాకిస్థాన్ విజయం సాధించింది. తర్వాత ఇండియా, న్యూజిలాండ్ తలపడగా.. భారత్ మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. దీంతో జట్టు తీవ్ర నిరాశగా ఉన్నా.. పాకిస్తాన్‌తో తలపడి విజయం సాధించింది. గ్రూప్ ఏలో భాగంగా న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో తలపడిన భారత్ ఈ రోజు శ్రీలంకతో తలపడనుంది. తర్వాత మ్యాచ్‌లో ఆస్త్రేలియాతో పోటీపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్‌కు ఈజీ అవుతుంది. రన్‌రేట్ తప్పనిసరి.. శ్రీలంకతో భారీ రన్‌రేట్‌తో గెలిస్తేనే సెమీస్‌కు జట్టు చేరుతుంది. ఆస్ట్రేలియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెమీస్‌ను చేరాలంటే ఆసీస్‌ను ఈ మ్యాచ్‌లో ఓడించాల్సిందే. ఒకవేళ ఆస్ట్రేలియాను ఓడించిన రన్‌రేట్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో రన్‌రేట్ ఎక్కువగా ఉంటేనే సెమీస్‌కు చేరవచ్చు. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి.. ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇస్తుంది. దుబాయ్ వేదికగా ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఇది కూడా చూడండి: 'BIG ANNOUNCEMENT' అంటూ లోకేష్ ఆసక్తికర ట్వీట్! భారత్, శ్రీలంక మొత్తం 25 టీ20లు ఆడగా.. 19 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. శ్రీలంక 5 మాత్రమే విజయం సాధించగా ఒక మ్యాచ్ రద్దయ్యింది. శ్రీలంక జట్టు కెప్టెన్, ఓపెనర అయిన చమరి ఆట మొదలుపెడితే ఆపడం కష్టమే. భారత్ జట్టు శ్రీలంకను అంచన వేయకుండా కాస్త తెలివిగానే ఆడాలి. బ్యాటర్లు రన్‌రేట్‌ను భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా ఇంకా గెలవలేదు. శ్రీలంక పాకిస్థాన్ చేతిలో ఓడిపోగా.. బోణీ కోసం ఎదురుచూస్తుంది. ఇది కూడా చూడండి: ఆర్టీవీ ఎఫెక్ట్..నకిలీ విదేశీ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్బీఐ సర్క్యులర్ #2024-t20-world-cup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి