బౌలర్లతోనే నాకు తలనొప్పి.. భారత టీ20 కెప్టెన్ సూర్య! భారత క్రికెట్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అందరూ నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పుడు కెప్టెన్‌పై చాలా ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. కొన్నిసార్లు ఎవరితో ఏ ఓవర్ వేయించాలనేది అర్థంకాక తలనొప్పిగా ఉంటుందన్నాడు. By srinivas 07 Oct 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Suryakumar yadav: భారత క్రికెట్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంగ్లాదేశ్‌తో మొదటి మ్యాచ్ విజయం అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరీస్‌లో శుభారంభం దక్కినందుకు ఆనందంగా ఉందని, భారత్‌కు బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే, జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉండటమూ ఒక్కోసారి కెప్టెన్‌కు తలనొప్పిగా మారుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. Off to a good start 💪 pic.twitter.com/bsPpwDMlsO — Surya Kumar Yadav (@surya_14kumar) October 6, 2024 అదే అసలైన సవాల్.. ‘మేము అనుకున్నదే గ్రౌండ్ లో అప్లే చేశాం. అందరూ అద్భుత ప్రదర్శన చేశారు. కుర్రాళ్లు చక్కగా కుదురుకున్నారు. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు.. అయినా మా బ్యాటర్లు ఒత్తిడికి గురికాకుండా దూకుడుగా ఆడారు. అయితే కెప్టెన్‌గా నాకు అసలైన తలనొప్పి బౌలింగ్ చేస్తున్నపుడే ఉంటోంది. ఎందుకంటే జట్టులో అందరూ బెస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు ఎవరితో ఏ ఓవర్ వేయించాలనేది అర్థం కాదు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రెండో మ్యాచ్ గెలుపుకోసం మరింత కృషి చేస్తామన్నాడు. బంగ్లాను కూల్చేసిన బౌలర్లు.. ఇక మూడు టీ20 సిరీస్‌లో భాగంగా భారత్ మొదటి బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. అర్ష్‌దీప్ సింగ్ 3/14), వరుణ్ చక్రవర్తి (3/31), మయాంక్ యాదవ్ (1/21) ధాటికి మొదట బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. అనంతరం హార్దిక్ (39 నాటౌట్; 16 బంతుల్లో 5×4, 2×6) మెరవడంతో భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29; 14 బంతుల్లో 2×4, 3×6), సంజు శాంసన్ (29; 19 బంతుల్లో 6×4) పర్వాలేదనింపించారు. అర్ష్‌దీప్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో మ్యాచ్ బుధవారం ఢిల్లీలో జరగనుంది. #india-cricket-team #suryakumar-yadav మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి