/rtv/media/media_files/2025/03/25/a2gLxibM7D78td6p0HTO.jpg)
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వీరవిహారం చేశాడు. 42 బంతుల్లో (97*) పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సులున్నాయి. అతనికి తోడుగా..చివర్లో శశాంక్ సింగ్ (44*)ఉతికారేశాడు. ఏకంగా 16 బంతుల్లోనే 44 పరుగులు రాబాట్టాడు. సిరాజ్ వేసిన 20వ ఓవర్లో ఏకంగా 22 పరుగులు బాదాడు. అంతకుముందు ప్రియాంష్ ఆర్య(47), మార్కస్ స్టోయినిస్ (20), అజ్మతుల్లా ఒమర్జాయ్ (16) పరుగులు చేశారు. గ్లెన్ మాక్స్వెల్(0) ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 3, రషీద్ ఖాన్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. కాగా శశాంక్ సింగ్ ను పంజాబ్ టీమ్ రూ.5.50 కోట్లకు కొనుగోలు చేసింది.
Shreyas Iyer - 97*(42).
— TATA IPL 2025 (@SaiSampathX) March 25, 2025
Shashank - 40*(15).
Priyansh - 47(23).#GTvsPBKS
- PUNJAB POSTED 243/5 IN 20 OVERS & LED BY CAPTAIN SHREYAS IYER..!!!! 🔥 pic.twitter.com/9e3iEixhlz