/rtv/media/media_files/2026/04/16/mi-2026-04-16-21-14-10.jpg)
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ ఐపీఎల్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆయన ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 53 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో డి కాక్, ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్ల తరపున సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడు కూడా ఆయనే కావడం విశేషం. 2026 వేలంలో ముంబై ఇండియన్స్ కేవలం కోటి రూపాయలకే ఆయనను దక్కించుకోగా, ప్రస్తుత సీజన్‌లో తన ఐదో మ్యాచ్‌లోనే ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
PLAYERS TO SCORE HUNDREDS FOR 3 DIFFERENT TEAMS IN IPL HISTORY:
— Ayush Singh (@AyushSingh4173) April 16, 2026
KL Rahul - DC, PBKS, LSG
Sanju Samson - DC, RR, CSK
Quinton de Kock - DC, LSG, MI*#mivspbkspic.twitter.com/v95mkOoppZ
డి కాక్ ఐపీఎల్ ప్రయాణంలో సెంచరీల పరంపర 2018లో మొదలైంది. అప్పట్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ తన మొదటి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశారు. ఆ తర్వాత 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ 140 పరుగులతో అజేయమైన భారీ ఇన్నింగ్స్ ఆడారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరపున మూడో సెంచరీని సాధించి తన రికార్డును పూర్తి చేసుకున్నారు.
కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మాత్రమే
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మాత్రమే మూడు వేర్వేరు జట్ల తరపున సెంచరీలు సాధించిన రికార్డును కలిగి ఉన్నారు. కేఎల్ రాహుల్ పంజాబ్, లక్నో , ఢిల్లీ జట్ల తరపున, సంజూ శాంసన్ రాజస్థాన్, ఢిల్లీ, చెన్నై జట్ల తరపున వంద పరుగులు చేశారు. ఇప్పుడు వీరిద్దరి సరసన డి కాక్ చేరడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us