/rtv/media/media_files/2026/03/27/pink-ball-2026-03-27-18-09-15.jpg)
పాకిస్థాన్ సూపర్ లీగ్ 11వ సీజన్ గురువారం లాహోర్‌లో ప్రేక్షకులు లేకుండానే చప్పగా ప్రారంభమైంది. షాహీన్ అఫ్రిదీ నేతృత్వంలోని లాహోర్ ఖలందర్స్, మార్నస్ లబుషేన్ సారథ్యంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో లాహోర్ జట్టు 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే, మ్యాచ్ ఫలితం కంటే మైదానంలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
మ్యాచ్ జరుగుతుండగా తెల్లటి బంతి హఠాత్తుగా పింక్ కలర్‌లోకి మారిపోయింది. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే.. హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఆటగాళ్లు బంతిని మెరుగు పెట్టడం కోసం తమ ప్యాంట్లకు రుద్దినప్పుడల్లా, ఆ బట్టల రంగు బంతికి అంటుకుంది. జెర్సీల నాణ్యత ఎంత దారుణంగా ఉందంటే.. రెండో ఓవర్ నుంచే బంతి రంగు మారడం మొదలైంది. 15వ ఓవర్ వచ్చేసరికి బంతి పూర్తిగా పింక్ కలర్‌లోకి మారిపోవడంతో అంపైర్లు దానిని మార్చాల్సి వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు "ఇవి ఒరిజినల్ కిట్స్ ఆ లేక నకిలీవా?" అంటూ పీఎస్ఎల్ స్టాండర్డ్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
Peak Pakistan Super League standards 😭
— Brutal Truth (@sarkarstix) March 26, 2026
During the very first match of PSL 11, the ball literally turned pink every time Hyderabad Kingsmen players rubbed it on their kit.
Did they get knockoff kits instead of authentic ones?
International league or gully-level experiment? 🤡 pic.twitter.com/Beq5zhmSkb
సాధారణంగా పీఎస్ఎల్ అంటే భారీ హంగామా ఉంటుంది. కానీ ఈసారి వెస్ట్ ఆసియాలో నెలకొన్న సంక్షోభం, ఇంధన కొరత కారణంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రజలను అనవసరంగా బయట తిరగొద్దని కోరారు. దీంతో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించలేదు. అంతేకాకుండా, ఆరు నగరాల్లో జరగాల్సిన ఈ టోర్నీని కేవలం లాహోర్, కరాచీలకు మాత్రమే పరిమితం చేశారు. ఆడంబరంగా జరగాల్సిన ఓపెనింగ్ సెర్మనీని కూడా రద్దు చేశారు.
6 వికెట్లకు 199 పరుగులు
ఇక మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ కేవలం 130 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది.
Follow Us