టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బద్దలే!?

ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. డబ్ల్యూటీసీలోనూ 5వేల పరుగులతో మొదటిస్థానంలో ఉన్నాడు. క్యాలెండర్ ఇయర్‌ రన్స్ పరంగా సచిన్ రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. 

New Update
drererer

Joe Root: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ చేసిన రూట్.. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. జో రూట్‌కు టెస్ట్‌ల్లో ఇది 35వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్‌ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. అంతేకాదు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లోనూ 5,000 పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా అవతరించాడు. మొత్తం 59 మ్యాచ్‌లు ఆడి 5,005 పరుగులు సాధించాడు. రెండ్ స్థానంలో 3,904 పరుగులతో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్, మూడో స్థానంలో స్టీవ్ స్మిత్ 3,484 పరుగులతో కొనసాగుతున్నారు. 

సచిన్‌ సరసన చేరేందుకు మరో అడుగు..

అలాగే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 1000 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ సరసన చేరేందుకు రూట్ మరో అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది రూట్ ఇప్పటికే 1000 పరుగులు చేయగా.. మొత్తం 5 క్యాలెండర్ సంవత్సరాలలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ మొత్తం 6 సార్లు ఈ ఘనత సాధించాడు. సచిన్ రికార్డును అందుకోవాలంటే జో రూమ్ మరో ఏడాది 1000 పరుగులను సాధించాల్సి ఉంది. మరో ఏడాదిలోపై సచిన్ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. ఐదు క్యాలెండర్ సంవత్సరాల్లో 1000కి పైగా టెస్ట్ పరుగులను సాధించిన ఆటగాళ్ల జాబితాలో బ్రియాన్ లారా, మాథ్యూ హెడెన్, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, అలిస్టర్ కుక్‌ ఉన్నారు. 

మూడేళ్లుగా భీకర ఫామ్..

మూడేళ్లుగా జో రూట్ భీకర ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే పరుగుల వరద పారిస్తున్నాడు. 2021 నుంచి 16 హాఫ్‌ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైగా పరుగులు చేశాడు. ఈ మధ్యకాలంలో జో రూట్ చేసిన రన్స్, సెంచరీలు ఏ ఆటగాడూ చేయలేదు. కోహ్లీ 2 సెంచరీలు కొట్టేలోపు జో రూట్ ఏకంగా 18 సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. కాగా టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీల (51) రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉంది. 

టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు:
సచిన్‌-51
కల్లిస్‌-45
పాంటింగ్‌-41
సంగక్కర-38
ద్రవిడ్‌-36
రూట్‌-35*
కోహ్లీ-29*

మ్యాచ్‌ విషయానికొస్తే.. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ 3 వికెట్ల నష్టానికి 370 పరుగులతో ఆడుతోంది. రూట్‌ (132), హ్యారీ బ్రూక్‌ (74) క్రీజ్‌లో ఉన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు