/rtv/media/media_files/2024/11/24/PSDEfLhZpPZmfkaen9MT.jpg)
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం నేడు ప్రారంభం కాబోతుంది. జెడ్డా(సౌదీ అరేబియా) వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మెగా వేలం ప్రారంభం కానుంది. నేడు, రేపు నిర్వహించినున్న ఈ మెగా వేలంలో దాదాపుగా 577 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. ఇందులో భారత ఆటగాళ్లు 367 ఉండగా.. విదేశీయులు 210 మంది ఉన్నారు. అయితే ఈ వేలంలో కేవలం 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ మెగా వేలం ప్రతీ మూడేళ్లకి ఒకసారి జరుగుతుంది. ఈ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ దగ్గర రూ.110.5 కోట్లు ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 14న జరగనుంది.
ఇది కూడా చూడండి: MH: మహారాష్ట్రలో పని చేసిన పవన్ ప్రచారం..ఒక్క చోట మాత్రం..
Am I dreaming? 🤯
— Chinmay Shah (@chinmayshah28) November 23, 2024
Sanju Samson is in the front row, standing at the center of the auction poster ahead of the IPL 2025 Auction! Sanju, the brand of the IPL, is here! 🤯 pic.twitter.com/8a9rednKCE
ఇది కూడా చూడండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
పంజాబ్ కింగ్స్ దగ్గరే..
పంజాబ్ కింగ్స్- రూ.110.5 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్- రూ.55 కోట్లు
గుజరాత్ టైటాన్స్- రూ.69 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్- రూ. 69 కోట్లు
ముంబయి ఇండియన్స్- రూ.45 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్- రూ.45 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రూ.83 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్- రూ.73 కోట్లు
కోల్ కతా నైట్ రైడర్స్- రూ. 51 కోట్లు
రాజస్థాన్ రాయల్స్- రూ. 41 కోట్లు
ఇది కూడా చూడండి: నేడే ఐపీఎల్ మెగా వేలం.. ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత ఉందంటే?
ఇది కూడా చూడండి: పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది..చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో సంచలనాలు