/rtv/media/media_files/2025/03/23/ScPDtnBHZ1gKNQVKLLQ6.jpeg)
CSK vs MI
🔴IPL 2025 SRH vs RR Live Score:
IPL 2025: ఇవాళ సన్ రైజర్స్ VS రాజస్థాన్ మ్యాచ్.. ఆ టీమ్‌కే గెలుపు అవకాశాలు
ఐపీఎల్ 2025 మొదలైంది. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగబోతోంది. ఇందులో సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2025/03/23/9sI7KiZNmRKFIEc6byc7.jpg)
SRH vs RR: ఐపీఎల్ టీమ్స్ లో తూకం వేస్తూ అన్ని జట్లూ కలిపి ఒకవైపు...ఒకే ఒక్క జట్టు ఒకవైసు సమంగా తూగుతాయి. అదే హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు. లాస్ట్ సీజన్ లో కప్ గెలవలేకపోయినప్పటికీ బీభత్సమైన ఆటతో అద్భుతాలు చేసిన సన్ రైజర్స్. వీర బాదుడుకి మారు పేరుగా నిలిచింది. రికార్డుల మోత మోగించింది. నిరుటి ప్రదర్శనతో ఐపీఎల్‌లో కొత్త రికార్డులు, ప్రత్యర్థి జట్లలో వణుకు పుట్టించిన సన్‌రైజర్స్.. కొత్త సీజన్లో దండయాత్రకు సిద్ధమైంది. ఈరోజు సొంత స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో ఢీకొనడానికి రెడీ అయింది.
Also Read: IPL మ్యాచ్‌లో జోరుగా బ్లాక్ టికెట్ల దందా.. 11 మంది అరెస్టు
దుర్భేద్యంగా ఉన్న సన్ రైజర్స్..
బ్యాటింగ్, బౌలింగ్ లలో అత్యంత పటిష్టంగా ఉన్న హైదరాబాద్ సన్ రైజర్స్ ఈసారి ఐపీఎల్ లో ఫేవరెట్ జట్టు. ఇదే జోష్ తో ఈరోజు రాజస్థాన్ యాల్స్ మీద మ్యాచ్ గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది. మరోవైపు కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్ లోనే టఫ్ ఫైట్ కు సిద్ధమైంది. ఆ టీమ్ కు హైదరాబాద్ ను ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి.
Also Read: భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్.. భారత్ కోటి ఖాతాలు తొలగింపు!
గతేడాది అత్యంత హైస్కోర్లతో హోరెత్తించిన సన్ రైజర్స్ ఈసారి 300 మైలు రాయిని చేరుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. నిరుడు ఒక్క సీజన్‌లోనే మూడు సార్లు 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేసింది. ఊచకోత ప్రత్యర్థి జట్లలో దడ పుట్టేలా చేసింది. క్రితం సారి లాగే ఈసారి కూడా ఓపెనర్లు అభిషేక్‌శర్మ, ట్రావిస్ హెడ్‌తో పాటు వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డిలు వీర విహారం చేడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటూ టీమ్ లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మహ్మద్ షమి రూపంలో అనుభవంతో కూడిన నాణ్యమైన పేసర్లు ఉండటం కూడా అదనపు బలంగా ఉంది. వీరికి తోడుగా పేసర్లు జైదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్...ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌ల స్పిన్ మాయాజాలంతో సన్‌రైజర్స్‌కు తిరుగులేని టీమ్ గా ఉంది.
Also Read: బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే!
అత్యంత వీక్ గా రాజస్థాన్..
మరోవైపు ప్రారంభానికి ముందే కెప్టెన్ సంజూ శాంసన్ కు గాయమవడంతో రాజస్థన్ రాయల్స్ డీలా పడిపోయింది. ఇతను వికెట్ కీపింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక కెప్టెన్ గా సంజూ స్థానంలో రియాగ్ పరాన్ వచ్చి చేరాడు. ఇనికి ఇదే మొదిసారి కెప్టెన్సీ. దీంతో ఏ మేరకు టీమ్ ను నడిపిస్తాడో అంచనా వేయడం కష్టంగా మారింది. ఇవన్నీ అలా ఉంటే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్‌ను వేలం పాటకు ముందు వదిలేసుకోవడంతో రాజస్థాన్ బ్యాటింగ్ అయిపోయింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను మినహాయిస్తే పరాగ్, షిమ్రన్ హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, నితీశ్ రాణాలు ఎలా ఆడతారో ఎవరికీ పెద్దగా తెలయదు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే జోఫ్రా ఆర్చర్ ఆధ్వర్యంలోని సందీప్‌శర్మ, తుషార్ దేశ్‌పాండే, ఫజల్‌హక్ ఫారూఖీ, మహీశ్ తీక్షణ, వనిందు హసరంగలు బౌలర్లుగా ఉన్నారు. వీరి మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచే ఛాన్స్ ఉందని స్పోర్ట్స్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్
-
Mar 23, 2025 21:50 IST
4 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 36/1 పరుగులు చేసింది
-
Mar 23, 2025 21:37 IST
మొదటి వికెట్ కోల్పోయిన చెన్నై
-
Mar 23, 2025 21:34 IST
మొదటి ఓవర్ లో 5 పరుగులు చేసిన చెన్నై
-
Mar 23, 2025 21:12 IST
ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 155/9 పరుగులు చేసింది.
-
Mar 23, 2025 21:06 IST
9వ వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్ 141/9
-
Mar 23, 2025 21:01 IST
8వ వికెట్ కోల్పోయిన ముంబై 128/8
-
Mar 23, 2025 20:51 IST
7వ వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్ 118/7
-
Mar 23, 2025 20:35 IST
6వ వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్ 96/6
-
Mar 23, 2025 20:32 IST
తిలక్ వర్మ 31 పరుగులకు ఔట్
-
Mar 23, 2025 20:31 IST
5వ వికెట్ కోల్పోయిన ముంబై 95/5
-
Mar 23, 2025 20:23 IST
సూర్య కుమార్ యాదవ్ 29 పరుగులకు ఔట్
-
Mar 23, 2025 20:23 IST
4వ వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
-
Mar 23, 2025 20:01 IST
6 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 52/3 పరుగులు చేసింది.
-
Mar 23, 2025 19:59 IST
3 వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
-
Mar 23, 2025 19:41 IST
2వ వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
-
Mar 23, 2025 19:36 IST
మొదటి ఓవర్ లో ముంబై ఇండియన్స్ 4/1
-
Mar 23, 2025 19:35 IST
రోహిత్ శర్మ 0 డకౌట్
-
Mar 23, 2025 19:35 IST
CSK Vs MI మొదటి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
-
Mar 23, 2025 18:16 IST
6 ఓవర్లకు 77/3 పరుగులు చేసిన SRH
-
Mar 23, 2025 17:52 IST
యశస్వీ జైస్వాల్ 1 పరుగుకే ఔట్
-
Mar 23, 2025 17:52 IST
మొదటి వికెట్ కోల్పోయిన SRH
-
Mar 23, 2025 17:28 IST
IPL టోర్నీలో అత్యధిక స్కోర్ 286/6 చేసిన SRH
-
Mar 23, 2025 17:28 IST
IPL చరిత్రలో రికార్డు తిరగరాసిన SRH
-
Mar 23, 2025 17:22 IST
45 బంతుల్లో 100. ఫోర్లు 10, సిక్స్‌లు 6
-
Mar 23, 2025 17:22 IST
SRH బ్యాటర్ ఇషాన్ కిషన్ సెంచరీ
-
Mar 23, 2025 17:16 IST
18 ఓవర్లకు SRH స్కోర్ 256/3
-
Mar 23, 2025 17:12 IST
17 ఓవర్లకు SRH స్కోర్ 239/3
-
Mar 23, 2025 17:11 IST
ఇషాన్ కిషన్ ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే ఐపీఎల్‌లో అతడికిదే తొలి శతకం అవుతుంది.
-
Mar 23, 2025 17:11 IST
క్రీజులో ఇషాన్ కిషన్ (81), నితీశ్ కుమార్ రెడ్డి (19)
-
Mar 23, 2025 17:10 IST
శతకం దిశగా సాగుతున్న ఇషాన్
-
Mar 23, 2025 17:10 IST
అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్
-
Mar 23, 2025 16:26 IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. SRH Vs RR మ్యాచ్ రద్దు!?
-
Mar 23, 2025 16:26 IST
కావ్య పాప హ్యాపీ.. దంచి కొడుతున్న హైదరాబాద్ బ్యాటర్లు!
-
Mar 23, 2025 16:15 IST
ఇజ్జత్ తీసుకున్న పాక్.. సిరీస్ గోవింద గోవిందా
-
Mar 23, 2025 15:48 IST
హైదరాబాద్ మొదటి వికెట్ డౌన్ అభిషేక్ శర్మ(24) ఔట్
-
Mar 23, 2025 15:35 IST
సన్ రైజర్స్ బ్యాటింగ్
-
Mar 23, 2025 15:32 IST
టాస్ గెలిచిన రాజస్థాన్
-
Mar 23, 2025 13:35 IST
IPL 2025: ఇవాళ సన్ రైజర్స్ VS రాజస్థాన్ మ్యాచ్.. ఆ టీమ్‌కే గెలుపు అవకాశాలు
-
Mar 23, 2025 13:34 IST
IPL మ్యాచ్‌లో జోరుగా బ్లాక్ టికెట్ల దందా.. 11 మంది అరెస్టు
-
Mar 23, 2025 13:33 IST
Uppal Stadium: ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ జరగబోతున్న ఉప్పల్ స్టేడియం ప్రత్యేకతలు తెలుసా?