![rinku priya](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/21/4b6kShWkA0bnbN3A9I0S.jpg)
rinku priya Photograph: (rinku priya)
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ స్వయంగా వెల్లడించారు. ముందుగా రింకూ సింగ్ తో ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్ జరిగిందన్న వార్తలను కొట్టిపారేసిన ఆయన రింకు కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతున్నాయని మాత్రమే వెల్లడించారు. తాజాగా వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. రింకూ సింగ్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపిన తర్వాత పెళ్లి తేదీ, వేదిక నిర్ణయిస్తామని చెప్పారు. లక్నోలో వీరి నిశ్చితార్థం జరుగుతుందని తెలిపారు.
రింకూ సింగ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 మ్యాచ్‌ల సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. ఇక ప్రియా రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో బిజీగా ఉంది. మచ్లీ షహర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ప్రియా , రింకూ సింగ్ కొంతకాలంగా పరిచయం ఉంది. వాళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే పెళ్లికి పెద్దల అంగీకారం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ జంట త్వరలో ఒకటి కానుంది.
25 ఏళ్ల ప్రియ పెళ్లికాకముందు గతంలో సుప్రీం కోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 2024లో జౌన్‌పూర్ జిల్లాలోని మచ్లిషహర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రియా 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన తండ్రికి ప్రచారం చేస్తున్నప్పుడు మొదటిసారిగా వెలుగులోకి వచ్చారు. ఆమె ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఆర్ట్స్ డిగ్రీని కలిగి ఉంది. నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ నుండి లా డిగ్రీని కూడా పొందింది. ఇక ఆమె తండ్రి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. కాగా రింకూ సింగ్ త్వరలో జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు.
सपा सांसद #PriyaSaroj के पिता तूफानी सरोज ने बताया हैं कि क्रिकेटर #RinkuSingh और बेटी सांसद प्रिया सरोज की शादी तय हो गई हैं.. pic.twitter.com/x52i4pahYv
— VSM News (@vsmbharatnews) January 20, 2025
ఏప్రిల్ 2023లో అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రింకూ సింగ్ తుఫాను ఇన్నింగ్స్ తర్వాత, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని నటుడు షారుఖ్ ఖాన్ రింకుకు ఫోన్ చేసి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని అడిగాడినట్లుగా వెల్లడించాడు. తాను ఏ పెళ్లికి వెళ్లనని, అయితే తన పెళ్లికి హాజరవుతానని, డ్యాన్స్ కూడా చేస్తానని షారుఖ్ అన్నట్లుగా రింకు తెలిపారు. అప్పటి నుంచి రింకు పెళ్లి గురించి చర్చలు మొదలయ్యాయి.
Also Read : Donald Trump: అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది..తొలి స్పీచ్ తో అదరగొట్టిన ట్రంప్!