Ind Vs Ban: దుమ్ములేపిన రిషబ్ పంత్.. అద్భుతమైన సెంచరీ!

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్  అద్భుతమైన సెంచరీ సాధించి.. టెస్ట్ కెరీర్‌లో తన ఆరో సెంచరీని నమోదు చేశాడు.  

New Update
Rishabh Panth captain

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్  అద్భుతమైన సెంచరీ సాధించి.. టెస్ట్ కెరీర్‌లో తన ఆరో సెంచరీని నమోదు చేశాడు.  డిసెంబర్ 2022లో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం తర్వాత దాదాపు 632 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్‌కి రీఎంట్రీ ఇచ్చి ఈ  ఫీట్‌ను నెలకొల్పాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు. కాగా రిషబ్ పంత్ 124 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సెంచరీ చేశాడు.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 149 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 227 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 287/4 వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రస్తుతం బాంగ్లాదేశ్ 158/4 పరుగుల వద్ద ఉంది. ఇక ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాలంటే 357 రన్స్ చేయాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు