Cricket Lovers కు బ్యాడ్ న్యూస్.. తొలి టెస్ట్‌కు వర్షం ముప్పు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రేపు జరగనున్న న్యూజిలాండ్‌-భారత్ తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా ఈ రోజు జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయ్యింది.

New Update
FotoJet3.

క్రికెట్ ప్రియులకు భారత వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ తెలిపింది. అక్టోబర్ 16 బుధవారం నుంచి బెంగళూరులో జరిగే మ్యాచ్‌లకు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదు రోజుల పాటు బెంగళూరులో జరిగే మ్యాచ్‌లకు అన్ని రోజులు ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో రేపు జరగాల్సిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌‌కి వర్షం ఆటంకం ఉంది.   

ఇది కూడా చూడండి: Sleep Apnea: గురక పెట్టేవారు జాగ్రత్త!

వర్షాలకు ప్రాక్టీస్‌కి ఆటంకం..

ప్రస్తుతం బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ రోజు ఉదయం 11:15 గంటలకు జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయ్యింది. రేపటి నుంచి రెండు రోజులు వర్షాలు ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడో రోజు నుంచి వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయి. ఇదిలా ఉండగా భారత్‌లోనే మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ బెంగళూరు స్టేడియంలో ఉంది. 

ఇది కూడా చూడండి:  Yadadri : యాదాద్రి లడ్డూ క్వాలిటీ.. ల్యాబ్ రిపోర్ట్ లో ఏం తేలిందంటే?

ఒకవేళ కాస్త తక్కువ వర్షాలు కురిస్తే వెంటనే స్టేడియాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసుకోవచ్చు. కానీ భారీ వర్షాలు కురిస్తే మ్యాచ్ నిర్వహించడం కష్టమే. భారత్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. ఎందుకంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్ చేరాలంటే తప్పకుండా ఈ సిరీస్‌లో గెలవాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది.

ఇది కూడా చూడండి:  ప్లాపులతో పనిలేదు.. వరుస ఆఫర్లు కొట్టేస్తున్న బ్యూటీ.. ఆ హీరోయిన్ మరెవరో కాదు?

ఇదే కంటిన్యూ చేయాలంటే ఈ సిరీస్‌లో ఇండియా తప్పకుండా గెలవాల్సిందే. కానీ వర్షం భారత ఆశలపై నీళ్లు చల్లుతున్నట్లు ఉంది. భారీ వర్షాలు ఐదు రోజుల పాటు పడితే ఇంకా సిరీస్ గోవిందే. ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 62 టెస్టులు జరిగాయి. ఇందులో భారత్ 22, న్యూజిలాండ్ 13 టెస్టుల్లో గెలవగా.. 27 టెస్టులు డ్రా అయ్యాయి.

ఇది కూడా చూడండి:  Kenya : కెన్యాలో పంచాయితీ పెట్టిన అదానీ.. అసలేమైందంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు