/rtv/media/media_files/2026/03/12/pandya-2026-03-12-17-18-16.jpg)
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. పాండ్యాపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో పాండ్యాపై పూణే పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతకు ఏం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్ 2026 విజయోత్సాహంలో భాగంగా జాతీయ జెండాను చుట్టుకుని తన లవర్ తో స్టేడియంలో రచ్చ రచ్చ చేశాడు. వేదికపైన లవర్ తో పడుకుని సరసాలాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.
అడ్వకేట్ వాజిద్ ఖాన్ అనే వ్యక్తి శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం సెలబ్రేషన్స్ సమయంలో పాండ్యా త్రివర్ణ పతాకాన్ని తన శరీరం చుట్టూ చుట్టుకుని, మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించారని వాజిద్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఈ ప్రవర్తన చట్ట ప్రకారం నేరమని ఆయన వాదించారు. ఈ మేరకు పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరారు.
బ్యాట్‌తోనూ, బంతితోనూ అద్భుతంగా
కాగా ఈ టోర్నీలో పాండ్యా బ్యాట్‌తోనూ, బంతితోనూ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా నమీబియాపై 28 బంతుల్లోనే 52 పరుగులు చేసి మెరుపు దాడి చేశారు. ఈ టోర్నీ మొత్తంలో 9 వికెట్లు పడగొట్టి ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లోనూ చోటు సంపాదించారు.2024లో బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచిన భారత్ .. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గిన మొదటి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. తన దేశం కోసం అన్ని ట్రోఫీలను గెలవడమే తన లక్ష్యమని పాండ్యా ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఒకవైపు ఈ చారిత్రక విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఈ జాతీయ జెండా వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
దేశానికి గొప్ప విజయాన్ని అందించిన భావోద్వేగంలో పాండ్యా చేసిన పని అని, అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని పాండ్యా అభిమానులు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. మనం ఎంతటి సెలబ్రిటీలమైనా, ఎంత పెద్ద విజయం సాధించినా జాతీయ చిహ్నాలకు ఇచ్చే గౌరవంలో లోటు ఉండకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Follow Us