/rtv/media/media_files/2025/03/22/oatNeHToH7T02t3r2T2Q.jpg)
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆరంభంలోనే మొదటి వికెట్ కోల్పోయింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అయిదో బంతికి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి క్వింటన్ డికాక్(4) వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సునీల్ నరైన్ (12), అజింక్య రహానే (16) పరుగులతో ఉన్నారు. జట్టు స్కోర్ 32గా ఉంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
మొదటి మ్యాచ్, మొదటి ఓవర్, మొదటి వికెట్ 🔥
— StarSportsTelugu (@StarSportsTel) March 22, 2025
RCB కి అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన హెజల్‌వుడ్ 😎
ఇది #TATAIPL, ఇక్కడ ఏదైనా సాధ్యమే!
చూడండి | #TATAIPL | #KKRvRCB లైవ్
మీ Star Sports 1 & 2 Telugu & JioHotstar లో #IPLOnJioStar #IPL2025 pic.twitter.com/ZoE4TDOHzn
జట్లు ఇవే
బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రసిఖ్ సలామ్, సుయాశ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.
కోల్‌కతా: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానె (కెప్టెన్), రింకు సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి