Amanpreet Singh : తీవ్ర విషాదం...   36 ఏళ్లకే విరాట్ కోహ్లీ టీమ్ మేట్ కన్నుమూత!

క్రికెట్ లోకంలో విషాదం నెలకొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు, పంజాబ్ మాజీ పేసర్ అమన్ ప్రీత్ సింగ్ గిల్ (36) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA),  మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

New Update
gill

క్రికెట్ లోకంలో విషాదం నెలకొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు, పంజాబ్ మాజీ పేసర్ అమన్ ప్రీత్ సింగ్ గిల్ (36) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA),  మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేవలం 36 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం క్రీడాకారులను షాక్‌కు గురిచేసింది. ఆయన మృతికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.

విరాట్ కోహ్లీకి సహచరుడిగా

2007లో టీమిండియా అండర్-19 జట్టు తరపున 5 వన్డేలు, ఒక యూత్ టెస్ట్ ఆడారు. ఆ సమయంలో ఆయన విరాట్ కోహ్లీకి సహచరుడిగా ఉన్నారు. పంజాబ్ తరపున 6 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశారు. 008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్  జట్టులో సభ్యుడిగా ఉన్నారు. : క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ మెంబర్‌గా సేవలందిస్తున్నారు.

అమన్ ప్రీత్ మృతిపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "అమన్ ప్రీత్ మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. కెరీర్ ప్రారంభ రోజుల్లో మేము కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాం. ఆయన చాలా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి, కష్టపడి పనిచేసే క్రికెటర్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అంటూ ట్వీట్ చేశారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా అమన్ ప్రీత్ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Advertisment
తాజా కథనాలు