వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీని కోహ్లీకి బహుమతిగా ఇవ్వండి: సెహ్వాగ్ భారత్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ -2023 సమరానికి సిద్ధమైంది. మంగళవారం ఐసీసీ ఓ ప్రత్యేక కార్యక్రమంలో మెగా టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై జరగనున్న ఈ టోర్నీలో భారత్ బరిలోకి దిగనుంది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. భారత ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. భారత స్టార్ విరాట్ కోహ్లీ కోసం ఈ కప్ సాధించాలన్నాడు. By Shareef Pasha 28 Jun 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ…మేము 2011 ప్రపంచకప్ సచిన్ టెండూల్కర్ కోసం ఆడాం. ట్రోఫీ గెలిచి కానుకగా ఇచ్చాం. అప్పుడు జట్టులో సచిన్ ఉంటే.. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈసారి భారత జట్టు కోహ్లీ కోసం ఆడాలి. వన్డే ప్రపంచకప్ 2023ని కోహ్లీకి బహుమతిగా అందించాలి. ప్రతి ఒక్కరూ ఇదే లక్ష్యంగా ఆడాలి. కోహ్లీ గొప్ప ఆటగాడు. ప్రపంచకప్‌లో అతడు చాలా పరుగులు చేశాడు. ఈసారి కూడా మైదానంలో 100 శాతం కష్టపడతాడు. మిగతా వారు అతడికి సహాయం అందించాలని అన్నాడు. 2011లో చివరిసారిగా భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ సహా విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. భారత్ కప్ గెలిచిన అనంతరం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కోహ్లీ తన భుజాలపై ఎత్తుకుని వాంఖడే స్టేడియం చుట్టూ తిరిగాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గౌతమ్ గంభీర్ (98) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. ఎంఎస్ ధోనీ (92 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ధోనీ సిక్స్ కొట్టడంతో భారత్ రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలిచింది. 2013లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ చాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. అప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్ కూడా టీమిండియా గెలవలేదు. 2015,2019 ఈసారి వన్డే ప్రపంచకప్‌లలో భారత్ ఫైనల్‌కు చేరుకులేకపోయింది. దాంతో 2011 ఫలితాన్ని పునరావృతం చేయాలని ప్లేయర్స్ అందరూ పట్టుదలతో ఉన్నారు. సొంతగడపై తమ సత్తా చూపాలని భారత్ చూస్తోంది. అయితే గత మూడేళ్లు విఫలమయిన విరాట్ కోహ్లీ ఫామ్ మళ్లీ అందుకోవడం శుభసూచికమని చెప్పాలి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి