బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ జరిమానా విధించిన కోర్టు బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు కోర్టు 3.3 మిలియన్ డాలర్ల (రూ.27 కోట్లకు పైగా) జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రియో డి జెనీరో శివారులోని తన ఇంటి నివాసం వద్ద సరస్సు నిర్మించినందుకు గాను ఈ భారీ ఫైన్ విధించినట్లు కోర్టు తెలిపింది. సరస్సు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు టౌన్ కౌన్సిల్ నాలుగు జరిమానాలు విధించినట్టు కౌన్సిల్ సెక్రటేరియట్ తెలిపింది. By Shareef Pasha 04 Jul 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి తన విలాసవంతమైన భవనం వద్ద కృత్రిమ సరస్సు, బీచ్ నిర్మాణం పర్యావరణ నిబంధనలు తుంగలో తొక్కినట్టు ఆరోపణలు అప్పీలుకు 20 రోజుల గడువు నేమార్ తన భవనం వద్ద కృత్రిమ సరస్సు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు టౌన్ కౌన్సిల్ నాలుగు జరిమానాలు విధించినట్టు కౌన్సిల్ సెక్రటేరియట్ తెలిపింది. నేమార్‌కు మొత్తంగా 16 మిలియన్ రియాలు (రూ. 27,27,69,361) జరిమానా విధించినట్టు పేర్కొంది. అనుమతి లేకుండా నది నీటిని దొంగిలించడం, మళ్లించడం, వృక్ష సంపదను నరికివేయడం వంటి పలు అభియోగాలపై కౌన్సిల్ ఈ జరిమానా విధించింది. జరిమానాపై అప్పీలు చేసుకునేందుకకు నేమార్‌కు 20 రోజుల గడువు ఇచ్చింది. జూన్ 22న సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నేమార్ ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. విలాసవంతమైన ఆయన భవనం వద్ద నిర్మిస్తున్న కృత్రిమ సరస్సు, బీచ్‌లో అనేక పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం సైట్‌ను స్వాధీనం చేసుకుని కార్యకలాపాలు నిలిపివేయించారు. కోర్టు విధించిన జరిమానాపై నేమార్ కానీ, ఆయన కార్యాలయం కానీ ఇప్పటి వరకు ఎటువంటి రిప్లై రాలేదు.. అంతేకాదు ఎలాంటి స్పందన రాలేదు. అయితే గతంలోనూ నేమార్ మాన్షన్ వద్దకు అధికారులు వచ్చి భవన నిర్మాణాన్ని ఆపాలని కోరారు. అయితే తన తండ్రి వారితో గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో కాసేపు అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా నేమార్‌కు దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఏం చేయాలో తెలియని పరిస్ధితి నెలకొంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి