మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌కు క్యూ, స్టేడియం ఎంపికలో బీసీసీఐ వివక్ష... భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే అభిమానులు కోకొల్లలు. క్రికెట్‌ను ఒక మతంగా భావించే మన దేశంలో సరిగ్గా పుష్కరకాలం తర్వాత ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ జరుగబోతుంది. నాలుగోసారి ఆతిథ్యమివ్వబోతున్న భారత్ అందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే ధనిక బోర్డుగా వర్ధిల్లుతున్న బీసీసీఐ తమ రేంజ్‌లో ఏర్పాట్లు చేస్తుంది. మెగాటోర్నీకి మరో వంద రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఐసీసీ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. By Shareef Pasha 29 Jun 2023 in నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ వేదికలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వివక్ష తేటతెల్లమైంది. పుష్కర కాలం తర్వాత స్వదేశం వేదికగా జరుగుతున్న మెగాటోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ అభిమానుల ఆశలపై నీళ్లు గుమ్మరించింది. అహ్మదాబాద్‌కు అగ్రతాంబూలం వేసిన బీసీసీఐ హైదరాబాద్‌పై సవతితల్లి ప్రేమ చూపించింది. నరేంద్రమోదీ స్టేడియానికి 5 కీలక మ్యాచ్‌లు కేటాయించిన బోర్డు.. హైదరాబాద్‌కు 3 మ్యాచ్‌లతో సరిపెట్టింది. అయితే ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. అసలు ముచ్చట ఏంటంటే మెగాటోర్నీలో కీలకమైన మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌కు కేటాయిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన వేదికలైన ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరుకు అప్రాధాన్య మ్యాచ్‌లు ఇచ్చిన బోర్డు అహ్మదాబాద్‌కు మాత్రం పెద్దపీట వేసింది. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌కు అగ్రతాంబూలం వేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తనయుడు, బోర్డు కార్యదర్శి జై షా చక్రం తిప్పినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. మెగాటోర్నీలో తొలి మ్యాచ్, ఫైనల్ ఫైట్‌తో పాటు కోట్లాది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ ఎగురేసుకుపోయింది. ఇలా 5 కీలక మ్యాచ్‌లను తన్నుకుపోయిన జైషా మిగతా తొమ్మిది వేదికలకు ఎంగిలి మెతుకులు ఎగజల్లినట్లు అప్రధాన్య మ్యాచ్‌లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మంగళవారం విడుదలైన ప్రపంచకప్ షెడ్యూల్‌ను నిశితంగా పరిశీలిస్తే వేదికల విషయంలో బోర్డు వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు ప్రాధాన్యమిచ్చిన బోర్డు మొహాలీ(పంజాబ్), రాంచీ (జార్ఖండ్)కి మొండిచేయి చూపించింది. భారత క్రికెట్‌కు అహ్మదాబాద్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరొందిన నరేంద్రమోదీ స్టేడియం చరిత్రాత్మక మ్యాచ్‌లకు వేదిక అవుతోంది. బోర్డు కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఎన్నికైన జై షా కనుసన్నల్లో మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌కు క్యూ కడుతున్నాయి. పునరుద్ధరణ తర్వాత సామర్థ్యం పరంగా ప్రపంచంలో పెద్ద స్టేడియంగా మారిన అహ్మదాబాద్‌కు మ్యాచ్‌లు కేటాయిస్తూ వస్తున్నారు. గత రెండేండ్ల కాలంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు, భారత్ ఆడే వన్డే, టెస్టు, టీ20 మ్యాచ్‌లను అహ్మదాబాద్‌కు కేటాయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మిగతా వేదికలపై బీసీసీఐ ఒక రకంగా సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నది. తాజాగా ప్రపంచకప్ షెడ్యూల్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో మొదలుపెట్టి భారత్-పాకిస్థాన్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్-దక్షిణాఫ్రికా, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోనే జరుగనున్నాయి. హైదరాబాద్‌పై వివక్ష దేశంలో ఘనమైన క్రికెట్ వారసత్వానికి హైదరాబాద్ ప్రతీక. కానీ జై షా హవాలో హైదరాబాద్‌కు సముచిత రీతిలో ప్రాధాన్యం లేకుండా పోయింది. ఎంతసేపు అహ్మదాబాద్ జపం పటించే జై షా..హైదరాబాద్‌పై మరోమారు శీతకన్ను వేశారు. పాలకవర్గం పదవీకాలం ముగిసిందన్న కారణమనో లేక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సరైన ప్రాతినిధ్యం లేదన్న సాకుతో బోర్డు పెద్దలు మూడంటే మూడు మ్యాచ్‌లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదీ కూడా మన భారత్ ఆడే మ్యాచ్‌లు కాకుండా దాయాది పాకిస్థాన్ మ్యాచ్‌లు ఇవ్వడం వారి వైఖరికి అద్దం పడుతున్నది. సౌకర్యాల పరంగా ఏ స్టేడియానికి తీసిపోని హైదరాబాద్..బీసీసీఐ దృష్టిలో ధర్మశాల, పుణె, లక్నో కంటే తక్కువగా కనిస్తున్నది. దీంతో సొంతగడ్డపై టీమ్ ఇండియా మ్యాచ్‌లు చూద్దామనుకున్న హైదరాబాద్ అభిమానులకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి