అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్..షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. నవంబర్ 15న ఇదే వేదికపై... భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నారు. ఈ మేరకు.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ - 2023 షెడ్యూల్‌ను ఓ ప్రకటనలో విడుదల చేసింది. By Shareef Pasha 27 Jun 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 8న అస్ట్రేలియాతో భారత్.. చెన్నై వేదికగా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న భారత్-పాక్‌తో తలపడనుంది. మరోవైపు లీగ్ దశలో టీమ్ఇండియా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 15, 16న ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగ్గా.. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. హైదరాబాద్ వేదికగా 3 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక.. ఈ వరల్డ్ కప్‌నకు హైదరాబాద్, అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, లఖ్‌నవూ, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా సహా మొత్తం 10 వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. హైదరాబాద్‌తో పాటు గువాహటి, తిరువనంతపురం.. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వార్మప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక రెండు సెమీ-ఫైనల్‌లకు రిజర్వ్ డే ఉంటుంది. ఈ ఫైనల్‌కు నవంబర్ 20 రిజర్వ్ డే గా నిర్ణయించారు. ఇక దిల్లీ వేదికగా అక్టోబర్ 11న భారత్ - అఫ్గానిస్థాన్ మ్యాచ్ జరగనుండగా.. పుణె వేదికగా అక్టోబర్ 19న భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ ఉండనుంది. అంతే కాకుండా ధర్మశాల వేదికగా అక్టోబర్ 22న భారత్-న్యూజిలాండ్ మ్యాచ్, లఖ్‌నవూ వేదికగా అక్టోబర్ 29న భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్, కోల్‌కతా వేదికగా నవంబర్ 5న భారత్ - దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. భారత జట్టు ఆడే మ్యాచ్ లు.. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి