AP: హై అలర్ట్ .. కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా..! పల్నాడు జిల్లాలో పోలీస్ అధికారులు హై అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ సమయంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరింత అప్రమత్తమయ్యారు. నరసరావుపేట మండలం కాకాని జేఎన్టీయూ కాలేజ్ కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు. By Jyoshna Sappogula 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Palnadu: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ క్రమంలో పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ అయ్యారు. సమస్యత్మాక ప్రాంతాలలో మరింత అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ కేంద్రల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. Also Read: గెట్ రెడీ ఫర్ సెలబ్రేషన్స్.. వైసీపీ నేతలకు సజ్జల పిలుపు..! మరిన్ని జాగ్రత్తలు.. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పోలీస్ అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ సమయంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని జేఎన్టీయూ కాలేజ్ కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు. Your browser does not support the video tag. ప్రత్యేక నిఘా.. రేపు ఎన్నికల కౌంటింగ్ నేపధ్యంలో ప్రత్యేక బలగాలతో నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూసేందుకు డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ యంత్రాంగం. నరసరావుపేట, పిడుగురాళ్లలో డ్రోన్లతో పర్యవేక్షిస్తూ నిఘా పెట్టారు. కాగా, రేపు ఎవరైనా ఎక్కడైనా అల్లర్లకు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. #palnadu #special-surveillance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి