SpiceJet : హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్..పూర్తి వివరాలివే.!

హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సర్వీస్ నడుపుతున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి అయోధ్యలోని వాల్మీకి ఎయిర్ పోర్టుకు నేరుగా విమానాలను ప్రారంభించనుంది. ఏప్రిల్ 2 నుంచి.. వారంలో మూడు సార్లు నడిపేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది.

New Update
SpiceJet : హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్..పూర్తి వివరాలివే.!

Hyderabad to Ayodhya Flights: హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే రామభక్తులకు శుభవార్త చెప్పింది స్పైస్ జెట్ (SpiceJet). ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. విమానయాన సంస్థ బోయింగ్ 737 విమానాలను ఏప్రిల్ 2 నుంచి మంగళవారం, గురువారం, శనివారాల్లో వారంలో మూడు సార్లు విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. విమాన షెడ్యూల్‌లో SG616 అయోధ్య నుండి 13:25కి బయలుదేరి 15:25కి హైదరాబాద్ చేరుకుంటుంది. SG611 హైదరాబాద్ నుండి 10:45కి బయలుదేరి 12:45కి అయోధ్యకు చేరుకుంటుంది. డైరెక్ట్ రూట్‌లో దాదాపు రెండు గంటలపాటు విమాన ప్రయాణ వ్యవధి ఉంటుందని భావిస్తున్నారు. అయోధ్యకు విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు నగరాల మధ్య కనెక్టివిటీని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని స్పైస్ జెట్ వెల్లడించింది.

కాగా అటు ఎయిరిండియా అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్ కూడా అయోధ్యకు ప్రత్యేక విమానాలను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్నారని..వారికి అవసరాలను పరిగణలోని తీసుకుని...ప్రత్యేక విమానాలను నడిపేందుకు ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఎయిర్‌లైన్ ప్రస్తుతం ట్రయల్ విమానాలను నిర్వహిస్తోంది.

ఇది కూడా  చదవండి: వైద్యకళాశాలల్లో 4,356 బోధనా సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు