Hanuman Jayanti: హనుమాన్‌ జయంతి ప్రత్యేకత ఇదే..ఇలా స్వామిని పూజించండి

సనాతన ధర్మంలో హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకంగా చెబుతుంటారు. హనుమాన్ జయంతిని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం అభిజీత్ ముహూర్తంలో హనుమంతుని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

New Update
Hanuman Jayanti: హనుమాన్‌ జయంతి ప్రత్యేకత ఇదే..ఇలా స్వామిని పూజించండి

Hanuman Jayanti: హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఏడాది హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23న జరుపుకుంటున్నారు. ఎందుకంటే భజరంగ్‌ బలి ఇప్పటికీ భూమిపై బతికే ఉన్నారని నమ్ముతారు. సనాతన ధర్మంలో హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అంజనా, కేసరి కుమారుడు హనుమాన్‌ను చాలా పేర్లు ఉన్నాయి. ఈ రోజున హనుమంతుడు జన్మించాడని చెబుతారు. అపారమైన శక్తి కోసం హనుమంతుడిని పూజిస్తూ ఉంటారు. హనుమాన్ జయంతి పూర్ణిమ తిథి ఏప్రిల్ 23న అంటే ఈరోజు తెల్లవారుజామున 3.25 గంటలకు ప్రారంభం కాగా ఏప్రిల్ 24న ఉదయం 5.18 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం అభిజీత్ ముహూర్తంలో హనుమంతుని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజు ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది.

ఈరోజు హనుమంతుడిని ఎలా పూజించాలి?

ఈశాన్య దిశలో ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. ఆ తర్వాత హనుమంతుడితో పాటు శ్రీరాముని చిత్రపటాన్ని పెట్టాలి. ఎరుపు పువ్వులు, శ్రీరామునికి పసుపు పువ్వులను సమర్పించాలి. అంతేకాకుండా లడ్డూ, తులసిని నైవేధ్యంగా సమర్పించాలి. ముందుగా శ్రీరాముని మంత్రం 'ఓం రామ్ రామాయ నమః' జపించాలి. ఆ తర్వాత హనుమాన్ మంత్రం 'ఓం హన్ హనుమతే నమః' జపించాలి. హనుమంతుని ముందు నెయ్యి లేదా ఆవా నూనెతో దీపం వెలిగించి 5-11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. ఇలా చేయడం వల్ల కష్టాల నుంచి బయటపడవచ్చు. మీకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించండి. హనుమంతుడికి ఎరుపు పువ్వులు, స్వీట్లు సమర్పించాలి. ఈరోజు హనుమంతుడిని పూజిస్తే ఎలాంటి రోగాలు ఉండవు, పిల్లలకు కూడా ఎలాంటి దిష్టి ఉన్నా పోతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: అసలు చెంచాను ఎవరు కనుగొన్నారు?.. భారత్‌కు ఎలా వచ్చింది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు