BIG BREAKING: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది కేంద్రం. బీహార్, ఝార్ఖండ్ తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15000 కోట్లు కేటాయించింది. పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది, By V.J Reddy 23 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Budget 2024: బడ్జెట్ సమావేశాల్లో ఏపీపై వరాల జల్లు కురిపించింది కేంద్రం. బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. బీహార్, ఝార్ఖండ్ తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు కేటాయించింది. అవసరాన్ని బట్టి అమరావతికి మరింత సహాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. విభజన చట్టం క్రింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు కల్పిస్తామని అన్నారు. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు-హైదరాబాద్ ఇండస్ట్రీ క్యారిడార్ల డెవలప్మెంట్ కు తోడ్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేస్తామని సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అవుతుందని అన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. Also Read : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు #budget మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి