AP: చంద్రబాబు ఇలా చేయమని చెప్పారు.. ఆ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయి: స్పీకర్ అయ్యన్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బిఎసి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. By Jyoshna Sappogula 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Speaker Ayyanna Patrudu: శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బిఎసి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. నలుగురు ప్యానల్ స్పీకర్లను పెట్టుకోమని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆదేశించారన్నారు. ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు (Land Titling Act) బిల్లు ప్రవేశ పెడుతున్నారని.. హెల్త్ యూనివర్సిటీకి (Health University) ఎన్టీఆర్ పేరు మార్పు బిల్లు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే వచ్చే సమావేశాల లోపు కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 80% పూర్తయ్యాయని.. భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. Also Read: ఎన్డీఏ సభ్యుల సమావేశం.. ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం..! #ap-news #chandrababu-naidu #tdp #ayyanna-patrudu #land-titling-act మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి