ఫిఫా మహిళల వరల్డ్‌కప్ విజేతగా స్పెయిన్

ఫిఫా మహిళల వరల్డ్‌కప్‌-2023 విజేతగా స్పెయిన్‌ నిలిచింది. ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్‌ మ్యాచులో ఇంగ్లండ్ జట్టుపై 1-0తో గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో స్పెయిన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

New Update
ఫిఫా మహిళల వరల్డ్‌కప్ విజేతగా స్పెయిన్

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరిగిన ఫిఫా మహిళల వరల్డ్‌కప్‌-2023 విజేతగా స్పెయిన్‌ నిలిచింది. ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్‌ మ్యాచులో ఇంగ్లండ్ జట్టుపై 1-0తో గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో స్పెయిన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తొలి నుంచి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. నువ్వా నేనా అంటూ ఆటగాళ్లు తలపడ్డారు. 29వ నిమిషంలో కెప్టెన్ ఓల్గా కార్మోనా గోల్ చేయడంతో స్పెయిన్ శిబిరంలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. అనంతరం ఇంగ్లండ్ టీమ్ కూడా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అయినా కానీ అదృష్టం కలిసి రాలేదు. తొలి హాఫ్ పూర్తి కాగానే స్పెయిన్ 1-0తో ముందుంది. తర్వాత ప్రారంభమైన సెకండ్‌ హాఫ్‌లో ఇరు జట్లు గోల్ చేయడానికి పోటీపడ్డాయి. అయితే గోల్ చేయలేకపోయాయి. దీంతో స్పెయిన్ జట్టు విశ్వవిజేతగా అవతరించింది.

టోర్నీ ప్రారంభం నుంచి ఇంగ్లాండ్‌ మహిళల జట్టు అదరగొట్టింది. రెండో సెమీఫైనల్లో 3–1 గోల్స్‌ తేడాతో ఆతిథ్య ఆస్టేలియాపై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక మూడో స్థానం కోసం శనివారం జరిగిన మ్యాచ్‌లో స్వీడన్‌ 2-0తో ఆస్ట్రేలియాను ఓడించి కాంస్య పతకం అందుకుంది. 2003లో రన్నరప్‌గా నిలిచిన స్వీడన్‌.. గతంలో మూడుసార్లు(1991, 2011, 2019) కాంస్య పతకాలు నెగ్గడం విశేషం. మొత్తానికి వరల్డ్‌కప్ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించింది. జులై 20న ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో మొత్తం 32 దేశాలు పాల్గొన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా అమెరికా మహిళల జట్టు బరిలో దిగింది. 2019, 2015లో జరిగిన వరల్డ్ కప్పుల్లో విజేతగా నిలిచిన అమెరికా ఈసారి మాత్రం నిరాశపరిచింది.

ఈ టోర్నీలో పాల్గొన్న 32 జట్లను 8 గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ A:న్యూజిలాండ్, నార్వే, ఫిలిప్పీన్స్, స్విట్జర్లాండ్
గ్రూప్ B:ఆస్ట్రేలియా, ఐర్లాండ్, నైజీరియా, కెనడా
గ్రూప్ C:స్పెయిన్, కోస్టారికా, జాంబియా, జపాన్
గ్రూప్ D:ఇంగ్లండ్, హైతీ, డెన్మార్క్, చైనా
గ్రూప్ E:నెదర్లాండ్స్, పోర్చుగల్, యునైటెడ్ స్టేట్స్, వియత్నాం
గ్రూప్ F:బ్రెజిల్, ఫ్రాన్స్, జమైకా, పనామా
గ్రూప్ G:అర్జెంటీనా, ఇటలీ, దక్షిణాఫ్రికా, స్వీడన్
గ్రూప్ H: జర్మనీ, మొరాకో, కొలంబియా, సౌత్ కొరియా

Advertisment
Advertisment
తాజా కథనాలు