నిరుద్యోగులకు అలెర్ట్.. 904 రైల్వే జాబ్స్‌కి ముగుస్తున్న గడువు..!

సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2023 గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ జూలై3న రిలీజ్ అవ్వగా.. ఆగస్టు 2వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. మొత్తం 904 పోస్టుల ఉన్నాయి. దరఖాస్తు రుసుము రూ.100. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు.

New Update
నిరుద్యోగులకు అలెర్ట్.. 904 రైల్వే జాబ్స్‌కి ముగుస్తున్న గడువు..!

దేశంలో రైల్వే జాబ్స్‌కి విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. సౌత్ వెస్ట్రన్ రైల్వే 904 అప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు RRC హుబ్లీ అధికారిక సైట్ http://rrchubli.in  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 3న ప్రారంభం అవ్వగా.. ఆగస్టు 2న ముగియనుంది. అంటే మరో 4రోజుల్లోనే ఈ పోస్టుల గడువు ఎండ్‌ కానుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 904 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి.

ఖాళీ వివరాలు:
➡ హుబ్లీ డివిజన్: 237 పోస్టులు
➡ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ: 217 పోస్టులు
➡ బెంగళూరు డివిజన్: 230 పోస్టులు
➡ మైసూరు డివిజన్: 177 పోస్టులు
➡ సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు: 43 పోస్టులు

అర్హత :
అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50శాతం మార్కులతో, మొత్తంగా.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వయస్సు పరిమితి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
అప్రెంటిస్‌షిప్ కోసం ITI మార్కులతో పాటు మెట్రిక్యులేషన్‌లో మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.

దరఖాస్తు రుసుము:
దరఖాస్తు రుసుము రూ.100. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. SC/ST/మహిళలు/PwBD అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు RRC హుబ్లీ అధికారిక సైట్‌ని చెక్ చేయవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి:
స్టెప్ 1: RRC హుబ్లీ అధికారిక వెబ్‌సైట్ http://rrchubli.in కి వెళ్లండి .

స్టెప్ 2: హోమ్‌పేజీలో 'రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: మీ వివరాలను నమోదు చేసుకోండి.

స్టెప్ 4: వ్యక్తిగత, విద్యాపరమైన, ఇతర వివరాలను కలిగి ఉన్న దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

స్టెప్ 5: అవసరమైన పత్రాలను(documents) అప్‌లోడ్ చేయండి, దరఖాస్తు రుసుము చెల్లించండి.

స్టెప్ 6: ఫారమ్‌ను సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా చెక్ చేయండి.

స్టెప్ 7: సంబంధిత కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

RRC RECRUITMENT:
మరోవైపు భారతీయ రైల్వే RRC టెక్నీషియన్లు, JE, అసిస్టెంట్‌ లోకోపైలట్‌ రైలు మేనేజర్ పోస్టుల కోసం 677 ఖాళీలను భర్తీ చేయనుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ అప్లికేషన్ ఈ నెల 30న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 30.

మొత్తం ఖాళీలు: 677

సాంకేతిక నిపుణులు- 87
జేఈ- 117
అసిస్టెంట్‌ పైలట్- 390
రైలు మేనేజర్- 83

Advertisment
Advertisment
తాజా కథనాలు