ఫ్యాషన్ షోలో దుమ్మురేపిన బర్రెలక్క.. నెటిజన్లు ఫిదా!

సైమా ఫ్యాషన్ షోలో బర్రెలక్క (శిరీష) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తెల్లటి గౌను, , బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ లో వేడుకకు హాజరై అందరినీ అలరించింది. South Indian Influence Bloggers Award కూడా అందుకుంది. ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
ఫ్యాషన్ షోలో దుమ్మురేపిన బర్రెలక్క.. నెటిజన్లు ఫిదా!

2023 సైమా ఎక్స్ ఫో అవార్డ్స్ (South Indian Influence Bloggers Award) ఈవెంట్ లో బర్రెలక్క (శిరీష) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎల్లప్పుడూ సాధారణ దుస్తుల్లో కనిపించే శిరీష ఈసారి తెల్లటి గౌనులో వేడుకకు హాజరై అలరించింది. లైట్ మేకప్, బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ లో చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

publive-image

ఇక ఈ ఈవెంట్ లో స్టేజ్ పై ఎక్కి తన అభిమానులు, ఫాలోవర్లకు అభివాదం చేస్తూ మురిసిపోయింది. అక్కడికొచ్చిన ప్రముఖులు, యాంకర్స్ ఆమెను తెగ పొగిడేశారు. ఈ జనరేషన్ కు ఒక ఆదర్శవంతమైన ఆడపిల్ల అంటూ ప్రశంసలు కురిపించారు.

ఇది కూడా చదవండి :పిత్తాశయంలో రాళ్లు.. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా.. అసలేమైందంటే?

publive-image

ఇక ఈ అవకాశం లభించడంపై మాట్లాడిన శిరీష.. ఇదే ఫస్ట్ టైమ్ ఇలాంటి వేడుకలకు రావడం. చీఫ్ గెస్ట్ గా రావాలని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. మేడం వాళ్లు ఫోన్ చేసి రమ్మన్నారు. ఇక్కడ కూడా నాకు ఆదరణ లభించింది. నాపై ఇంతటి ప్రేమ చూపిస్తున్న వారందిరకీ ధన్యవాదాలు తెలిపింది. సౌత్ ఇండియన్ అవార్డ్ గెలుచుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. చివరగా తన హాబీస్ గురించి చెబుతూ.. ఎక్కువగా తినడం ఇష్టం. చిరుతిళ్లు బాగా అలవాటు. బయట ప్రపంచం తిరగాలని ఉంటది. చిన్న పిల్లలతో ఆడుకుంటానంటూ సరదాగా చెప్పుకొచ్చింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు