Indian Railways: ఆ 4 రైళ్లు ఇక కాజీపేట, కర్నూల్, బోధన్ వరకు.. అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే.. రేపటి నుంచే..

దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ఏపీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కాచిగూడ, కర్నూలు, బోధన్, కాజీపేట వరకు పలు రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ రైళ్ల సేవలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

New Update
Indian Railways: ఆ 4 రైళ్లు ఇక కాజీపేట, కర్నూల్, బోధన్ వరకు.. అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే.. రేపటి నుంచే..

తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరో శుభవార్త చెప్పింది. ఈ రాష్ట్రాల్లో సేవలు అందించే మొత్తం 4 ట్రైన్ల గమ్య స్థానాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం నాలుగు ట్రైన్లలో ఒకటి ప్యాసింజర్ ట్రైన్ కాగా.. మరో 3 ఎక్స్‌ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈ రైళ్ల సేవలను రేపు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. గమ్యస్థానం పొడిగింపబడిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త

- జైపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (Train No.919713/19714) ను ప్రస్తుతం జైపూర్‌-కాచిగూడ మధ్య నడుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. దీంతో కర్నూలుతో పాటు గద్వాల, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌ ప్రజలుకు ప్రయోజనం చేకూరనుంది.
ఇది కూడా చదవండి: MMTS: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏ రూట్లలో అంటే?

- ఇప్పటి వరకు హడప్సర్‌ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (17013/17014) ఇప్పటి వరకు హడప్సర్‌ (పూణె)- హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగించేది. ప్రస్తుతం ఈ ట్రైన్ ను భువనగిరి, జనగామ మీదుగా కాజీపేట వరకు పొడిగించారు.

- పర్భణీ డైలీ ఎక్స్‌ప్రెస్‌ (17664/17663)- ఈ ట్రైన్ ఇప్పటివరకు హెచ్‌ఎస్‌ నాందేడ్‌ - తాండూరు మధ్య రాకపోలకు సాగించేది. తాజాగా ఈ ట్రైన్ ను సేడం, యాద్గిర్‌ మీదుగా రాయచూరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే.

- కరీంనగర్‌ డైలీ ప్యాసింజర్‌ (07894/07893): కరీంనగర్‌ - నిజామాబాద్‌ మధ్య నడిచే ఈ ట్రైన్ ను తాజాగా బోధన్‌ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే.

Advertisment
Advertisment
తాజా కథనాలు