Sonia Gandhi: అజెండా ఏంటో తెలపాలి..మోడీకి సోనియా లేఖ!

సమావేశాలు గురించి తెలియజేయాలంటూ వాటి వివరాలు కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi) కి కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) లేఖ రాశారు.

New Update
Sonia Gandhi: అజెండా ఏంటో తెలపాలి..మోడీకి సోనియా లేఖ!

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సమావేశాలు గురించి తెలియజేయాలంటూ వాటి వివరాలు కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi) కి కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) లేఖ రాశారు. భారతదేశానికి చెందిన 9 కీలక అంశాల పై కూడా చర్చించాలని దానికి తగిన సమయం సమావేశాల్లో కేటాయించాలని ఆమె లేఖలో కోరారు.

దేశంలో ఉన్న ఏ పార్టీకి తెలియజేయకుండా ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసినట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. అసలు సమావేశాల ముఖ్య అజెండా ఏంటో ఏ విపక్ష పార్టీకి కూడా తెలియదని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మిగిలిన పార్టీల పట్ల కొంచెం పారదర్శకంగా వ్యవహరించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.

అలాగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అజెండాను కూడా తెలియజేయాలని ఆమె అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా వెంటనే ఆమోదించాలని విపక్షాలు ఎప్పటి నుంచో పట్టుబడుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రత్యేకంగా అదానీ అంశాన్ని కూడా తీసుకురావాలని విపక్ష పార్టీలు అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

అతి త్వరలోనే ఇండియా కూటమి ర్యాలీని ముందుగా మధ్యప్రదేశ్‌ లో నిర్వహించాలనుకుంటున్నట్లు కూడా సమాచారం. అంతేకాకుండా మణిపూర్ వంటి అంశాలను కూడా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు చర్చించాలని అనుకుంటున్నట్లు ఆమె లేఖలో తెలిపారు. అందుకే విపక్ష పార్టీలు ఈ సమావేశాల్లో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఆమె వివరించారు.

అయితే ఖర్గే నివాసంలో డిన్నర్‌ భేటీలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన విషయాల గురించి విపక్ష పార్టీలు ఇప్పటికే చర్చించాయి. అయితే విపక్షాలకు అజెండా తెలపకుండా సమావేశాలు నిర్వహించడం సరైంది కాదని ఖర్గే పేర్కొన్నారు. ముఖ్యమైన అంశాలను పక్కదారి పట్టించేలా బీజేపీ వ్యవహరిస్తుందని విపక్షాలు అంటున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు